NTV Telugu Site icon

Devara: మెంటలెక్కిస్తున్న ‘దేవర’.. ఒక్కోటి ఒక్కో డైమాండ్ మావా!

Devara Posters

Devara Posters

Devara Team Hyping up with Back to Back posters: ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘దేవర’ రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే యంగ్ టైగర్ పాన్ ఇండియా లెవల్లో ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ముంబై, చెన్నైని చుట్టేసిన తారక్.. సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేయనున్నాడు. ఆ నెక్స్ట్ డేనే అమెరికా వెళ్లి అక్కడ స్పెషల్ ప్రీమియర్ షోకి హాజరు కాబోతున్నాడు. మరోవైపు.. దేవర మ్యూజికల్ నైట్స్ అనే పేరుతో.. ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, వైజాగ్ సిటీలలో ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్స్‌కి కేవలం దేవర పాటలు పాడిన సింగర్స్ మాత్రమే వస్తారని, దేవర చిత్ర యూనిట్ రాదని సమాచారం. ఇక మరోవైపు.. దేవర పై సోషల్ మీడియాలో మేకర్స్ ఇస్తున్న హైప్‌ మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి. ముఖ్యంగా కొత్త కొత్త పోస్టర్‌లు రిలీజ్ చేస్తూ.. టైగర్ ఫ్యాన్స్‌కు మెంటల్ ఎక్కిస్తోంది చిత్ర యూనిట్.

Ridhi Bedi: వలపు వల విసిరి.. న్యూడ్ వీడియో కాల్ కి రమ్మంటుంది.. జాగ్రత్త బాసూ!

ఎన్టీఆర్‌కు సంబంధించిన సాలిడ్ స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. కొత్త పోస్టర్లు బయటికొస్తునే ఉన్నాయి. అందులో టైగర్ లుక్ కేక పుట్టించేలా ఉన్నాయి. దేవర, వర లుక్స్‌లో మస్త్ ఉన్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే.. దేవర పోస్టర్స్ అన్నీ కూడా ఒక్కోటి ఒక్కో డైమాండ్ అనే చెప్పాలి. ముఖ్యంగా తండ్రి పాత్రకు సంబంధించిన లుంగీ లుక్‌లో.. ఎన్టీఆర్ అలా బ్లాక్ అండ్ బ్లాక్‌లో నడిచొస్తున్న పోస్టర్‌లో మాత్రం మాస్ గాడ్‌లా పవర్ఫుల్‌గా కనిపిస్తున్నాడనే చెప్పాలి. దీంతో దేవరలో ఎన్టీఆర్ డబులో డోస్ మాస్ తాండవం పక్కా.. అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అన్నట్టు.. ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ కాదు.. ట్రిపుల్ రోల్ చేస్తున్నాడనే టాక్ ఉంది. అదే నిజమైతే.. బాక్సాఫీస్ దగ్గర దేవర చేయబోయే విధ్వంసానికి వెన్నులో వణుకు గ్యారెంటీ అంటున్నారు. మరి సెప్టెంబర్ 27న ఏం జరుగుతుందో చూడాలి.

Show comments