ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించి, వరల్డ్ వైడ్ ఫాన్స్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇదే జోష్ లో కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ‘దేవర’. జనతా గ్యారెంజ్ సినిమాతో బాక్సాఫీస్ రిపేర్లని రీజనల్ గా చేసిన కొరటాల-ఎన్టీఆర్ ఈసారి మాత్రం పాన్ ఇండియా రేంజులో బాక్సాఫీస్ పై దాడి చెయ్యడానికి రెడీ అయ్యారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న దేవర సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ కొరటాల శివ, సాలిడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసాడు. ఈ పోస్టర్ బయటకి రావడం, దేవర సినిమాపై అంచనాలు ఆకాశాన్ని చేరడం రెండూ ఒకటిసారి జరిగాయి. 2024లో రిలీజ్ అవ్వనున్న సినిమాల్లో మోస్ట్ ఆంటిసిపేపేటెడ్ సినిమాల్లో ఒకటిగా దేవర పేరు తెచ్చుకుంది.
సముద్రం బ్యాక్ డ్రాప్ లో, ఫర్గాటెన్ ల్యాండ్స్ లో దేవర సినిమా జరుగుతుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా లేటెస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి లీక్ లేకుండా కొరటాల శివ అండ్ టీం జాగ్రత్త పడ్డారు. హడావుడి లేకుండా సైలెంట్ గా మోస్ట్ వయొలెంట్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఈ ఫైట్ షూట్ అయిపోయిన తర్వాత… టాకీ పార్ట్ షూటింగ్ మొదలవనుంది. ఇప్పటివరకూ దేవర యాక్షన్ పార్ట్ ని మాత్రమే షూట్ చేసారు, ఆగస్టు రెండో వారం నుంచి టాకీ పార్ట్ స్టార్ట్ చేయనున్నారు. అక్టోబర్ చివరి నాటికి దేవర షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలి అనేది కొరటాల శివ ప్లాన్. ప్రస్తుతం మైంటైన్ చేస్తున్న స్పీడ్ చూస్తుంటే దేవర షూటింగ్ ఆన్ టైమ్ లోనే కంప్లీట్ అయ్యేలా ఉంది.