Site icon NTV Telugu

Devara: దేవర షూట్ కి అడ్డంకులు.. మొన్న అలా.. నేడు ఇలా!

Devara Shoot

Devara Shoot

Devara Shoot Stalled due to Heavy Rain: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్య భారీ డిజాస్టర్ చేసిన తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా? అని అందరి దృష్టి సినిమా మీదే ఉంది. ఇక దేవర సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మేరకు షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు.

Shyamala Devi: ఏపీలో ప్రభాస్ పెద్దమ్మ ప్రచారం.. ఎవరికోసమో తెలుసా?

ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఉండగా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ సహా మరి కొంతమంది మీద ప్రస్తుతం సీన్స్ పాడేరు ఘాట్ లో షూట్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం షూటింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా షూటింగ్ స్పాట్లో ఉన్న ఒక తేనె తుట్ట కదలడంతో తేనెటీగలు దాడి చేయగా షూటింగ్లో ఉన్న 20 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులకి తీవ్ర గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక ఇప్పుడు మరో సారి షూట్ నిలిచినట్టు తెలుస్తోంది. అక్కడ పెద్ద ఎత్తున వర్షం కురవడంతో ఈరోజు షూట్ నిలిచిపోయిందని అంటున్నారు.

Exit mobile version