NTV Telugu Site icon

Devara: దేవరపై ఇంట్రెస్టింగ్ రూమర్.. ఆ హాలీవుడ్ సినిమాకు ఇన్స్‌పిరేషనా?

Devara Sisu Inspire

Devara Sisu Inspire

Devara Movie Action Scenes Inspired From This Hollywood Flick: మన ఇండియన్ సినిమాల్లో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘దేవర’ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. నిజానికి.. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సింది కానీ, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్‌కి వచ్చిన పాన్ ఇండియా గుర్తింపు చూసి, కథలో చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. పాన్ ఇండియా అప్పీల్ తీసుకొచ్చేందుకు.. స్టోరీపై కొరటాల శివ చాలా నెలల పాటు కసరత్తు చేశాడు. ఫైనల్‌గా ఔట్‌పుట్ బెటర్‌గా రావడంతో.. ఎట్టకేలకు ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 22వ తేదీన ప్రారంభించారు. అప్పటి నుంచి శరవేగంగా ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ప్రారంభోత్సవం సమయంలోనే.. చావు అంటే భయం లేని మృగాళ్లను భయపెట్టించే హీరో నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోందని, కొరటాల స్టోరీ గురించి ఒక చిన్న హింట్ కూడా ఇచ్చేశాడు. కానీ, అసలు దేవర స్టోరీ ఏంటి? కాన్సెప్ట్ ఏంటి? అనేది ఎలాంటి క్లారిటీ లేదు.

Arjun – Shruti Case: అర్జున్-శృతి ‘మీటూ’ కేసులో కొత్త ట్విస్ట్.. శృతికి కోర్టు నోటీసులు

ఇలాంటి సమయంలో.. ‘దేవర’పై ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ సినిమా ‘సిసు’ నుంచి ఇన్స్‌పైర్ అయ్యి, ‘దేవర’లో యాక్షన్ సీన్లను తీర్చిదిద్దుతున్నారనే ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. ‘సిసు’లో యాక్షన్ సీన్లు చాలా వయోలెంట్‌గా, అద్భుతంగా ఉంటాయి. తమ ‘దేవర’లో కూడా యాక్షన్ సీన్లు చాలా వయోలెంట్‌గా ఉంటాయని కొరటాల చెప్పడంతో, బహుశా ‘సిసు’ నుంచి ప్రేరణ పొంది ఉంటారని టాక్ చక్కర్లు కొడుతోంది. మరి, ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ, ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ విషయంపై గట్టిగా చర్చించుకుంటున్నారు. అయినా.. హాలీవుడ్ సినిమా నుంచి ఇన్స్‌పైర్ అయ్యి, సినిమాలు తీయడమన్నది కొత్తేం కాదు. కొందరు మక్కీకి మక్కీ సీన్లను దింపేస్తే.. మరికొందరు చాలా మార్పులు చేసి, మరింత ఉన్నతంగా అందించేందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి.. ఇన్స్‌పైర్ అవ్వడంలో తప్పు లేదని చెప్పుకోవచ్చు. ఏదేమైనా.. ఇదో పాన్ ఇండియా సినిమా కాబట్టి, కొరటాల చాలా జాగ్రత్తగానే ఈ ప్రాజెక్ట్‌ని డీల్ చేస్తాడని నమ్మకంగా ఉండొచ్చు. ఇందులో తారక్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.

Pawan Kalyan OG: యూనిట్‌లో చేరిన క్రేజీ నటుడు.. మరింత వైబ్రెంట్‌గా ఓజీ

Show comments