NTV Telugu Site icon

Devara: ఏప్రిల్ 5 నుంచి ఇండిపెండెన్స్ డేకి వాయిదా?

Devara

Devara

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదు అనుకున్నారో… ఇప్పుడదే జరగబోతోంది. దేవర వాయిదా పడిందనే మాట సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. అందుకు పలు కారణాలు చెబుతున్నారు. దేవరలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌కి షూటింగ్‌లో గాయాలు అవడం ఒకటైతే… నెక్స్ట్ ఏపి ఎలక్షన్స్ దేవరను వెనక్కి వెళ్లేలా చేసిందంటున్నారు. ఏప్రిల్ 5న దేవర రిలీజ్‌ అని ముందే అనౌన్స్ చేశారు మేకర్స్. అదే సమయంలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దేవరను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు ఏప్రిల్ 5వ తేదీన బాలీవుడ్ సినిమాలతో పోటీ ఉంది, ఈద్ కావడంతో అక్కడ థియేటర్లు దొరకడం కష్టమే. ఇలా పలు కారణాల వల్ల దేవర వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు. ఇంకా మేకర్స్ నుంచి అఫిషీయల్ అనౌన్స్మెంట్ బయటికి రాలేదు గానీ… దాదాపుగా దేవర వాయిదా పడినట్టేనని అంటున్నారు.

మరి దేవర కొత్త రిలీజ్ ఏంటి? అంటే, దాని పై కూడా చర్చ జరుగుతోంది. సమ్మర్ ఎండింగ్‌ లేదా ఆగస్టు, అప్పటికీ కుదరకపోతే సెప్టెంబర్‌లో దేవర రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే… ఆగష్టులో దేవర వస్తానంటే ఇప్పటికే పుష్ప 2 రేసులో ఉంది. ఒకవేళ దేవర ఆగష్టు 15న వస్తే… పుష్ప2 కూడా పోస్ట్ పోన్ అయినట్టే. పుష్ప సెకండ్ పార్ట్‌ని డిసెంబర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అయితే… ఇలాంటి వార్తల్లో క్లారిటీ లేదు గానీ… దేవర పార్ట్ 1, పుష్ప 2 రిలీజ్ డేట్ మాత్రం అభిమానులను కన్ఫ్యూజన్లో పడేశాయి. ప్రస్తుతానికి దేవర టీమ్ నుంచి వచ్చే ట్వీట్ కోసం వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.