Devara: బీచ్ లో జాన్వీతో ఎన్టీఆర్ రొమాన్స్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందదే. మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక అందుకోసమే.. కొరటాల, ఎన్టీఆర్.. ప్రతిదీ ఆచితూచి.. టైమ్ ఎక్కువ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ గా చెక్కుతున్నారు. ఇక ప్రస్తుతం దేవర షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలు గోవాలో చిత్రీకరించారట. ఇక్కడ ఫినిష్ చేసుకొని గోకర్ణ వెళ్లనున్నట్లు సమాచారం.
Mangalavaram: పెయిడ్ ప్రీమియర్స్ రివ్యూ.. ఆర్ఎక్స్ 100 ను మించి ..?
Also Read
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
- Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
ఇక గోవాలో ఒక రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతం గోవా బీచ్ దగ్గర ఒక బీచ్ సాంగ్ ను ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రైవేట్ గోవా బీచ్ లో ఒక విలేజ్ సెట్ కూడా సెట్ చేశారని తెలుస్తోంది. ఇక ఇందులో ఎన్టీఆర్, జాన్వీ రొమాన్స్ ఘాటుగానే ఉంటుందని టాక్. బీచ్ సాంగ్… ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్, జాన్వీ అందాలు.. కొరటాల టేకింగ్.. వేరే లెవెల్ అని ఫ్యాన్స్ ఇప్పటికే ఊహించేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో బీచ్ సాంగ్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా టెంపర్ లో బీచ్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవరాలో కూడా అదే రీపీట్ అవుతుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
-
Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
-
AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
-
Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
-
Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!