NTV Telugu Site icon

Devara Glimpse: 72 సెకండ్స్ వీడియోతో వస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ హీరో…

Devara Shooting Update

Devara Shooting Update

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ దేవర సినిమా చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ ఇప్పుడు దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే పోస్టర్స్ తో నందమూరి అభిమానుల్లో జోష్ పెంచిన దేవర నుంచి గ్లిమ్ప్స్ బయటకి రాబోతుంది. వరల్డ్ ఆఫ్ దేవరని ఎస్టాబ్లిష్ చేసేలా దేవర గ్లిమ్ప్స్ ఉండబోతుందని సమాచారం. జనవరి 8న గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తున్నామని ఇప్పటికే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేయడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాని కబ్జా చేసారు. 24 గంటల్లో దేవర గ్లిమ్ప్స్ కి 1.5 మిలియన్ లైక్స్ ఇచ్చి లైక్స్ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయాలనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్లాన్. ఇదే జరిగితే దేవర సినిమాపై హైప్ అమాంతం పెరిగిపోవడం గ్యారెంటీ.

పాన్ ఇండియా ప్రమోషన్స్ కి సాలిడ్ స్టార్ ఇవ్వాలి అంటే దేవర నుంచి వస్తున్న గ్లిమ్ప్స్ అదిరిపోవాలి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు దేవర గ్లిమ్ప్స్ ని కొరటాల శివ 72 సెకండ్ల నిడివితో కట్ చేసాడని సమాచారం. ఈ 72 సెకండ్ల గ్లిమ్ప్స్ దేవర బాక్సాఫీస్ ఫేట్ ని ఆల్మోస్ట్ డిసైడ్ చేయబోతుంది. గ్రాఫిక్స్ తేడా కొడితే ఆదిపురుష్ సినిమాకి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారో అందరికీ తెలుసు. దేవర సినిమా ఎక్కువ శాతం గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ లోనే చేసారు కాబట్టి ప్రతి ఒక్కరి ద్రుష్టి విజువల్ ఎఫెక్ట్స్ పైన పడుతుంది. సో సీజీ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా దేవర గ్లిమ్ప్స్ లో అన్నీ బాగున్నాయి అనిపించిన తర్వాతే రిలీజ్ చేయడం మంచిది.

Show comments