NTV Telugu Site icon

Devara Glimpse Records: ఇది ‘దేవర’ క్రేజ్… అన్నీ ఎరుపెక్కాయి!

Devara Glimpse Records

Devara Glimpse Records

ఎక్కడైనా సముద్రం ఎరుపెక్కుతుందా? అంటే, సూర్యోదయానికో లేదంటో సూర్యస్తమయానికో అలాంటి విజువల్ మాత్రమే కనిపిస్తుంది కానీ దేవర ఊచకోతకు రక్తపాతంతో సముద్రం ఎరుపెక్కింది. 80 క్షణాల గ్లింప్స్‌ తో బ్లడ్ బాత్ కి శాంపిల్ చూపించాడు కొరటాల శివ. గ్లింప్స్‌ ఎండ్ షాట్ లో ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన తర్వాత… రక్తంతో కలిసిన అలలు ఎన్టీఆర్ పై పడడం అనేది అద్భుతంగా. దేవర షూటింగ్ కోసం ఏకంగా బ్లడ్ ట్యాంకర్స్‌ను తీసుకెళ్లిన కొరటాల… ఏప్రిల్ 5న ఫుల్ థియేటర్లను ఎరుపెక్కించబోతున్నాడు అనే విషయం గ్లింప్స్‌ తో క్లియర్ గా తెలిసిపోయింది. దేవర గ్లింప్స్‌ దెబ్బకు డిజిటల్ మీడియా అంతటా మోత మోగుతోంది. ట్విట్టర్లో దేవర ట్యాగ్స్ టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఎన్టీఆర్, దేవర, కొరటాల ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. దేవర గ్లింప్స్‌.. ఫ్యాన్స్‌ ఊహించుకుంటున్న దానికంటే ఎక్కువే హైప్ ఇచ్చింది.

గ్లింప్స్ పరంగా 24 గంటల్లో ఎన్నీ రికార్డులను బ్రేక్ చేయాలో… ఒక్కొక్కటిగా అన్నింటినీ బ్రేక్ చేస్తోంది దేవర. ఇప్పటివరకూ 40 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న దేవర గ్లింప్స్‌… తెలుగులో మాత్రమే 22 మిలియన్ వ్యూస్ కి పైగా సొంతం చేసుకుంది. దీంతో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు గ్లింప్స్‌ గా దేవర పేరు తెచ్చుకుంది. 24 గంటలు కంప్లీట్ అవ్వడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఫైనల్ గా ఈరోజు ఈవెనింగ్ ని ఎన్టీఆర్ నెక్స్ట్ వచ్చే హీరోల గ్లింప్స్‌ కి భారీ టార్గెట్ నే సెట్ చేసేలా ఉన్నాడు. లైక్స్ విషయంలో కూడా దేవర గ్లింప్స్‌ 650K లైక్స్ ని సాధించింది, ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయాలి అంటే దేవర గ్లింప్స్‌ మరో 80K లైక్స్ ని ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాల లోపై రాబట్టాలి. అప్పుడే దేవర గ్లింప్స్‌ లైక్స్ పరంగా కూడా రికార్డ్ క్రియేట్ చేసినట్లు అవుతుంది. ప్రస్తుతం ఈ రికార్డ్ పవన్ కళ్యాణ్ పేరు పైన ఉంది మరి ఎన్టీఆర్ ఏం చేస్తాడో చూడాలి.