Site icon NTV Telugu

Devara First Single: భయపెట్టడానికి దేవర వస్తున్నాడు.. గెట్ రెడీ!

Devara First Single

Devara First Single

Devara First Single to Release on May 19th: సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ నామస్మరణతో మారుమోగిపోతుంది. దేవర ఫస్ట్ సింగిల్ మే 19న రిలీజ్ చేయబోతున్నాం అని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దేవర ట్యాగ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కొత్త ప్రపంచంలో పీరియాడిక్ సీ బ్యాక్ డ్రాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ అక్టోబర్ 10కి వాయిదా పడింది. ఇక మే 19న దేవర ఫస్ట్ సింగిల్ రానుండడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ మేరకు దేవర సినిమా యూనిట్ ఒక పోస్టర్ కూడా వదిలింది. ఫియర్ సాంగ్ వస్తోందని చెబుతూ పోస్టర్ లో ఎన్టీఆర్ చేయి గొడ్డలి పట్టుకుని ఉన్నట్టుగా రిలీజ్ చేశారు. ఇక దేవర ప్రాజెక్ట్.. సౌత్ ట్రేడ్లో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువగా హైలెట్ అవుతుంది.

Mathew Thomas: ప్రేమలు నటుడి ఇంట తీవ్ర విషాదం

జాన్వీ కపూర్,సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఇందులో నటించడం పైగా బి టౌన్ మార్కెట్ స్పేస్ వీరికంటూ స్పెషల్ గా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయేలా చేశాయి. సైఫ్ అలీ ఖాన్ నటించిన ఫస్ట్ తెలుగు టెక్నీషియన్స్ మూవీగా దేవరను ట్రీట్ చేస్తున్నారు. తాజాగా తారక్ వార్ -2 సెట్ లోకి అడుగు పెట్టడంతో దేవర హిందీ రైట్స్ అప్ డేట్స్ ను బి టౌన్ మీడియా వైరల్ చేస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పుడున్న ట్రెండ్ ను అర్థం చేసుకుని హిందీ థియేట్రికల్ రైట్స్ ను ధర్మ ప్రొడక్షన్స్ , ఏఏ ఫిలిమ్స్ ఇండియా వారు సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో విపరీతమైన క్రేజ్ వచ్చింది. దేవర కి ఇది ప్లస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతేకాక హిందీ లో ప్రముఖ నిర్మాణ సంస్థలు హిందీ రైట్స్ కొనుగోలు చేయడం తో దేవర హిందీ వసూళ్ల పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Exit mobile version