NTV Telugu Site icon

April 5th: దేవర డేట్ ని కబ్జా చేసిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్…

April 5th

April 5th

ఏప్రిల్ 5… దేవర లాక్ చేసుకున్న డేట్. దేవర పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని రిపేర్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు, ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటూ ఉండగా ఊహించని షాక్ ఇస్తూ దేవర వాయిదా పడింది. సైఫ్ కి యాక్సిడెంట్ అవ్వడం, ఎలక్షన్స్ కారణంగా దేవర పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు దేవర మిస్ అయిన డేట్ ని లాక్ చేసుకోని ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకి రావడానికి రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేయడానికి రెడీ అవుతుంది. గీతాగోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మృణాల్ ది ఫామిలీ స్టార్ సినిమాకి యాడెడ్ ఎస్సెట్ అవనుంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు.

ఏప్రిల్ 5నే రిలీజ్ అవుతున్న మరో సినిమా శశివదనే. రైట్ హ్యాండ్ తో ప్రామిస్ అంటూ సాంగ్స్, టీజర్ తో మెప్పించిన శశివదనే మేకర్స్ ఏప్రిల్ 5న సినిమాని రిలీజ్ చేస్తున్నాం అంటూ వాలెంటైన్స్ డే రోజున అనౌన్స్ చేసారు. యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన బ్యూటిఫుల్ విలేజ్ డ్రామాగా శశివదనే ఆడియన్స్ ముందుకి రానుంది. అహితేజ బెల్లంకొండ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని సాయి మోహన్ డైరెక్ట్ చేసాడు. రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ పెయిర్ అట్రాక్టివ్ గా ఉంది. రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్, శశివదనే సినిమాలు ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచబోతున్నాయి. ఈ రెండు సినిమాలు మంచి డేట్ ని లాక్ చేసుకున్నాయి. ఏప్రిల్ 5,6,7 వీకెండ్స్… 9న ఉగాది ఫెస్టివల్, 11న ఈద్ ఫెస్టివల్, 14న అంబెడ్కర్ జయంతి, 17న శ్రీరామ నవమి… 18 నుంచి మళ్లీ మూడు రోజుల పాటు వీకెండ్ స్టార్ట్ అవనుంది… అంటే ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 21 వరకూ పండగలతో పాటు వీకెండ్స్ కూడా కలిపి బ్యాక్ టు బ్యాక్ సెలవలు ఉన్నాయి…. మధ్యలో ఒకటి రెండు వర్కింగ్ డేస్ ఉన్నా కూడా దాదాపు 16 రోజుల పాటు హాలిడేస్ ది ఫ్యామిలీ స్టార్, శశివదనే సినిమాలకి కలిసి రానున్నాయి. మరి ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ని ఎంతవరకు క్యాష్ చేసుకుంటాయి అనేది చూడాలి.