NTV Telugu Site icon

Ram Charan : ఆటకూలీగా రామ్ చరణ్‌.. బుచ్చిబాబు ప్లాన్ అదిరింది

Ram Charan

Ram Charan

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇందులో చాలా ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం రామ్ చరణ్‌ పూర్తిగా తన లుక్ ను మార్చేసుకున్నాడు. విలేజ్ కబడ్డీ నేపథ్యంలో సినిమాను తీస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని తాజాగా లీక్ అయింది. ఇందులో ఆటకూలీగా రామ్ చరణ్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆటకూలీ అంటే చాలా మందికి తెలియదు.

Read Also : Rithu Chowdary : స్విమ్మింగ్ పూల్ లో రీతూ చౌదరి వయ్యారాలు..

కొందరు ఒక మేనేజ్ మెంట్ గా ఫామ్ అయి ఆటగాళ్లను కొనుక్కుని టీమ్ లను తయారు చేసుకుంటారు. ఆటగాళ్లకు రోజుకు ఇంత అని చెల్లిస్తుంటారు. వారినే ఆటకూలీలు అంటారు. అలాంటి ఆటకూలీ పాత్రలో రామ్ చరణ్‌ చాలా వైవిధ్యభరితంగా నటిస్తాడని తెలుస్తోంది. సినిమా కథ మలుపులు తిరిగే విధానం అందరినీ ఆకట్టుకుంటుందంట. పైగా విలేజ్ పరిధిలోనే ఈ కథ మొత్తం సాగుతుందని సమాచారం. ఇప్పటి వరకు ఇలాంటి కథ వెండితెరమీదకు రాలేదని కొన్ని లీకుల ఇస్తున్నారు. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.