Site icon NTV Telugu

Ram Charan : ‘పెద్ది’ ఫస్ట్ షాట్ ను వాడేసిన ఢిల్లీ టీమ్.. చరణ్‌ ఏమన్నాడంటే..?

Ram Charan

Ram Charan

Ram Charan : రామ్ చరణ్‌ నటిస్తున్న పెద్ది సినిమాకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మొన్న వచ్చిన ఫస్ట్ షాట్ కు భారీ రెస్పాన్స్ దక్కింది. అసలే ఐపీఎల్ సీజన్ కాబట్టి ఈ షాట్ ను చాలా మంది వాడేస్తున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లోని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అయితే ఏకంగా పెద్ది ఫస్ట్ షాట్ ను రీ క్రియేట్ చేసేసింది. ఈ రోజు సన్ రైజర్స్ తో ఢిల్లీ మ్యాచ్ ఉంది. ఈ సందర్భంగా ఢిల్లీ ప్లేయర్స్ తో పెద్ది ఫస్ట్ షాట్ ను రీ క్రియేట్ చేసిన వీడియోను పోస్టు చేసింది. యుద్ధానికి తాము రెడీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోపై తాజాగా రామ్ చరణ్ స్పందించాడు.
Read Also : CM Revanth Reddy: సమరం కాదు.. సమయ స్పూర్తి అవసరం.!

‘నా పెద్ది ఫస్ట్ షాట్ ను మాసివ్ గా రీ క్రియేట్ చేసిన ఢిల్లీ టీమ్ కు థాంక్స్. ఈ రోజు మ్యాచ్ కు ఆల్ ది బెస్ట్. సన్ రైజర్స్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలి’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌ పెద్ది షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌ షూట్ కు బ్రేక్ ఇచ్చి లండన్ టూర్ లో బిజీగా ఉంటున్నాడు. త్వరలోనే రీజాయిన్ అవుతాడు.
Read Also : Saif Ali Khan : ‘ఆదిపురుష్‌’ విషయంలో అందుకే సారీ చెప్పా.. సైఫ్ క్లారిటీ..

Exit mobile version