బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొణె ఎప్పుడూ ముందుంటుంది. గ్లామర్, నటన, డెడికేషన్ ఏదైనా అత్యుత్తమంగా రాణించే ఈ స్టార్ ఇటీవల వర్క్ అవర్స్‌పై తీసుకున్న నిర్ణయం కారణంగా చర్చల్లో నిలిచింది. భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నా, రోజుకు 8 గంటలకు మించి షూట్ చేయనని చెప్పడంతో ఇండస్ట్రీలో మంచి డిబేట్ మొదలైంది. నిజంగా ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో? తాజాగా జరిగిన ఈవెంట్‌లో దీపిక స్వయంగానే దీనిపై క్లారిటీ ఇచ్చింది.
Also Read : Sonakshi Sinha : మనం చేసే ప్రతి తప్పు.. కొత్త పాఠం నేర్పిస్తుంది
దీపిక మాట్లాడుతూ.. “ఇప్పుడంతా తక్కువ నిద్ర, ఎక్కువ పని కామన్ అయిపోయింది. కానీ మన శరీరం, మనసు రోజుకు 8 గంటల పనికంటే ఎక్కువను సపోర్ట్ చేయదు. దాని తర్వాత చేసే పనిలో క్వాలిటీ తగ్గిపోతుంది. ముఖ్యంగా నేను తల్లిని అయిన తర్వాత అమ్మలను మరింత గౌరవించాను. బయట పని, ఇంట్లో బేబీ ఇవి రెండింటినీ బాలన్స్ చేయడం మాటల్లో చెప్పడం ఇజీ కాదు. చాలా కష్టం. అందుకే కొత్త తల్లులకి ఇండస్ట్రీలో సపోర్ట్ ఎంతో అవసరం” అని వివరించింది. అంటే ఇటీవల కొన్ని పెద్ద ప్రాజెక్టుల నుంచి బయటకు రావడం కూడా ఇదే కారణమా అని అడగా..
“పర్సనల్, ప్రొఫెషనల్‌గా బిజీగా ఉన్నా నిద్ర, పోషకాహారం, వ్యాయామం ఇవి తప్పనిసరి. ఐస్ బాత్, రెడ్‌లైట్ థెరపీ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నిజమైన మేజిక్ నిద్ర, సరిగ్గా తినడంలోనే ఉంది. ఆరోగ్యం నాకు ఫస్ట్ ప్రియారిటీ” అని చెప్పి పరోక్షంగా సమాధానం ఇచ్చింది. “నా ఆఫీసులో కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే, రోజుకు 8 గంటలే పని చేస్తాం” అని వెల్లడించింది. అంటే దీని బట్టి అర్ధమవుతుంది దీపిక ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో. వర్క్‌లో ఎంత డెడికేషన్ ఉన్నా, ఆరోగ్యం ముందు. ఓవర్‌వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ ముఖ్యం అని అంటోంది.
