Site icon NTV Telugu

Deepika Padukone : ఆ డైరెక్టర్‌ని అన్ ఫాలో చేసిన దీపిక పదుకొణె..

Deepika

Deepika

బాలీవుడ్ ప్టార్ హీరోయిన్ దీపిక ప్రజంట్ వరుస వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల టాలీవుడ్‌లో ఆమెకు చేదు అనుభవాలు ఎదురైన సంగతి తెలిసిందే. స్పిరిట్, కల్కి 2898 AD చిత్రాల నుంచి ఆమెను తప్పించగా, దర్శకుడు సందీప్‌ వంగా ఆమెపై విమర్శలు గుప్పించారు. అలాంటి పరిస్థితుల్లో తాజాగా మరోసారి ఆమె పేరు సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. దీనికి కారణం బాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు ఫరాఖాన్‌.. అసలు విషయం ఏంటంటే

Also Read :Spirit Movie Update: ప్రభాస్ స్పిరిట్ లో మలయాళ బ్యూటీ..!

బాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు ఫరాఖాన్‌, దీపికా ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసుకున్నారు. ఇటీవల ఫరాఖాన్‌ నటి వర్కింగ్‌ అవర్స్‌పై ఫన్నీగా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఓ షోలో పాల్గొన్న దర్శకురాలు దీపికాను ఉద్దేశిస్తూ.. ‘ఆమె ఇప్పుడు పనిచేసేదే 8 గంటలు.. ఇక ఈ షోకు ఎలా వస్తారు. ఆమెకు అంత టైం ఎక్కడ ఉంటుంది’ అన్నారు. ఫరాఖాన్‌ సరదాగా అన్న ఈ మాటలు బాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి. దీంతో నటి ఆమెను అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఫరాఖాన్‌ కూడా దీపిక, రణ్‌వీర్‌ సింగ్‌లను అన్‌ఫాలో చేశారు. వీరిద్దరూ కలిసి గతంలో కొన్ని సినిమాలకు వర్క్‌ చేశారు. ‘ఓం శాంతి ఓం’, ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ సినిమాలకు ఫరాఖాన్‌ దర్శకత్వం వహించగా దీపిక ప్రధాన పాత్రలో నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది. కానీ, తాజాగా జరిగిన పరిణామాలతో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు.

Exit mobile version