దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భారీ సినిమాల ప్రమోషన్లకు ఇప్పుడు వేదికైంది. సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం అనేది మేకర్స్ కు గొప్ప అనుభూతి అని చెప్పొచ్చు. తాజాగా రణవీర్ సింగ్ నటిస్తున్న “83” సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇక్కడ విడుదల చేశారు. డిసెంబర్ 16న గురువారం రోజు యూఏఈలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ’83’కి స్టాండింగ్ ఒవేషన్ లభించడంతో రణ్‌వీర్ తో పాటు చిత్రబృందం సంతోషంలో మునిగితేలారు. ఆ తరువాత ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనంపై రణవీర్ చిత్రం ప్రదర్శించడంపై ఎమోషనల్ అయ్యింది.
Read Also : ‘పుష్ప’రాజ్ పై సైబరాబాద్ పోలీస్ హిలేరియస్ మీమ్… ‘తగ్గేదే లే’!
కొన్ని గంటల క్రితం రణ్‌వీర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో “దుబాయ్ 2021 డిసెంబర్ 16న రాత్రి 7:55” అనే పదాలతో ప్రారంభమయ్యే ఒక నిమిషం నిడివి గల వీడియోను షేర్ చేశాడు. అందులో ఆయన, దీపిక బుర్జ్ ఖలీఫా వైపు చూస్తున్నట్లు ఉంది. భార్యాభర్తలు మాత్రమే కాకుండా దర్శకుడు కబీర్ ఖాన్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌లను కూడా వీడియోలో చూడవచ్చు. కపిల్ దేవ్, మొహిందర్ అమర్‌నాథ్ ప్రమోషన్‌లలో భాగం అయ్యారు. ’83’ చిత్రం 1983లో భారత్ గెలుచుకున్న ప్రపంచ కప్ విజయం ఆధారంగా రూపొందించబడిన స్పోర్ట్స్ డ్రామా. రణవీర్‌కి గర్వకారణమైన, సంతోషకరమైన క్షణాన్ని చూసి దీపిక దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. బుర్జ్ ఖలీఫాపై ’83’ ట్రైలర్ ప్లే అవుతున్న సమయంలో ‘లెహ్రా దో’ బ్యాక్‌డ్రాప్‌లో ప్లే అవుతుంది.
A post shared by Ranveer Singh (@ranveersingh)
“83” విడుదలకు దగ్గరవుతున్న నేపథ్యంలో దీపిక, రణ్‌వీర్‌లు సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, బోమన్ ఇరానీ, అమ్మీ విర్క్, హార్డీ సంధు, జతిన్ సర్నా, తాహిర్ రాజ్ భాసిన్, జీవాత తదితరులు నటించారు. దీనికి విష్ణువర్ధన్ ఇందూరి, దీపికా పదుకొణె, సాజిద్ నడియాడ్‌వాలా, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ కలిసి నటిస్తున్నారు. ’83’ ఫిల్మ్ లిమిటెడ్ సపోర్ట్ తో 2021 డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
