Deepika Padukone: ఒక సాధారణ కుటుంబంలో భార్యాభర్తలు వారంలో ఒకసారి కలుస్తారు. పని ఒత్తిడి, డబ్బు సంపాదనలో పడి భార్యాభర్తలు ఇద్దరు కలిసి గడిపే సమయం చాలా తక్కువ. ఇది కేవలం సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఉన్న జంటలు అన్నీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కుటుంబంతో వారు గడిపే సమయం చాలా తక్కువ. ఇక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రతి సెలబ్రిటీ పోరాడుతూ ఉంటారు. ఇక ఇదే పరిస్థితిని నేనూ ఎదుర్కొంటున్నాను అని చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపికా.. స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఇద్దరూ కెరీర్ లో ముందుకు సాగడానికి బాగా కష్టపడుతున్నారు. దీనికోసం తమ పర్సనల్ లైఫ్ ను కూడా త్యాగం చేస్తున్నారు. ఇదే విషయాన్నీ దీపికా సైతం చెప్పుకొచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో దీపికా రణవీర్ తో కలిసి ఉన్న టైమ్ ను ఎలా ఎంజాయ్ చేస్తుందో చెప్పుకొచ్చింది.
Mahesh Babu: కృష్ణ వర్థంతి.. తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన మహేష్
” రణవీర్ తో టైమ్ స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. అతనికి కూడా ఇష్టమే.. కానీ, షూటింగ్స్ వలన కుదిరేది కాదు. ఒక్కోసారి తను షూటింగ్ అయిపోయాక .. నైట్ ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు. నేను ఉదయాన్నే షూటింగ్ కు వెళ్ళిపోవాలి. దీంతో ఆ మధ్యలో ఉన్న టైమ్ నే మేము గడపాలి. ఇకదాంతో ఎన్నోసార్లు ఆ టైమ్ లో మేము ఇద్దరం కలిసి డ్యాన్స్ చేస్తూ ఉండిపోయేవాళ్ళం. నాకు మ్యూజిక్ పెట్టుకొని .. రణవీర్ తో డ్యాన్స్ చేయడం ఇష్టం. అలా బెడ్ రూమ్ లో మ్యూజిక్ పెట్టుకొని తెల్లార్లు డ్యాన్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ దీపికా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. డబ్బు ముఖ్యమే కానీ, సమయం ఇంకా ముఖ్యం. ఈ సమయం మళ్లీ రాదు. ముందు మీ వైవాహిక జీవితం మీద ద్రుష్టి పెట్టండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.
