Site icon NTV Telugu

Kalki2898AD : కల్కీ సినిమా నుంచి దీపికా పదుకునే అవుట్..

Kalki

Kalki

ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది. విజువల్స్, కథ, స్టార్ కాస్ట్ అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. సహజంగానే సీక్వెల్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్‌లో హీరోయిన్ దీపికా పదుకొనే భాగం కాబోరని అధికారికంగా ప్రకటించారు. ప్రొడక్షన్ టీమ్ స్టేట్‌మెంట్‌లో..

Also Read : Manchu Lakshmi: కుటుంబంలో గొడవల‌పై రియాక్ట్ అయిన మంచు లక్ష్మి..

“మేము జాగ్రత్తగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మొదటి భాగంలో దీపికా ఎంతో కష్టపడ్డారు. కానీ క్రియేటివ్‌గా మన భాగస్వామ్యం కొనసాగలేదు. కల్కి 2898 AD లాంటి సినిమా పూర్తి అంకితభావాని, సమయాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులకు మా శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. ప్రజంట్ దీపిక ఒక బిడ్డకు తల్లి అయిన కారణంగా షూటింగ్ టైమింగ్ లో మార్పులు చేశారు. కల్కి లాంటి పెద్ద ప్రాజెక్ట్ కి సమయంతో పని ఉండదు. కానీ దీపిక ఇలాంటి నిబంధనలు పెట్టుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా మూవీ టీం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో సీక్వెల్‌లో హీరోయిన్ ఎవరు అనే చర్చ మొదలైంది. అభిమానులు కొత్త హీరోయిన్ పేరును తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక కల్కి 2898 AD సీక్వెల్ ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. మరింత భారీ స్థాయిలో, విస్తృతమైన విజువల్స్‌తో ఈ సీక్వెల్‌ను నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్నారని సమాచారం. దీపికా అవుట్ అయిన వార్తతో అభిమానుల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.

 

Exit mobile version