NTV Telugu Site icon

Deepika Padukone : బ్రేకింగ్: తల్లికాబోతున్నా.. గుడ్ న్యూస్ చెప్పిన దీపిక!

Deepika Padukone1

Deepika Padukone1

Deepika Padukone announces pregnancy: బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా పలువురు హీరోలు హీరోయిన్లు పెళ్లి బాట పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అలా పెళ్లి బాట పట్టిన హీరోలు హీరోయిన్లు ఒక్కరొక్కరుగా తల్లిదండ్రులు అవుతున్నారు. ఇప్పుడు తాజాగా దీపికా పదుకొనే తన అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సోషల్ మీడియా వేదికగా దీపికా పదుకొనే ఒక ఫోటో షేర్ చేసింది. అందులో సెప్టెంబర్ 2024 అని పేర్కొంటూ దీపిక అలాగే రణవీర్ అని రాసి ఉంది. ఆ ఫోటో చుట్టూ చిన్న పిల్లలకు సంబంధించిన బట్టలు, చెప్పులు, షూస్ ఉన్నాయి. దీంతో ఆమె తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించినట్లు అయింది. ఇక వీరు తమ మొదటి బిడ్డను సెప్టెంబర్ 2024వ సంవత్సరంలో తమ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. ఇక ఈ ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Disney Hotstar Merger : రిలయన్స్, డిస్నీ హాట్‌స్టార్ డీల్ ఓకే..

గత కొన్ని రోజులుగా దీపిక ప్రెగ్నెన్సీ గురించి చర్చలు జరుగుతున్నాయి. BAFTA అవార్డ్స్ 2024లో దీపిక చీర కట్టులో కనిపించినప్పుడు, అభిమానులు ఆమె బేబీ బంప్‌ని గమనించారు. ఆ సమయంలో ఆమె సబ్యసాచి వెండి సేక్విన్ చీరను ధరించింది. ఇందులో ఆమె తన బేబీ బంప్‌ను దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తూ కనిపించింది. బాఫ్టా అవార్డ్స్‌కు హాజరైన తర్వాత ముంబై విమానాశ్రయంలో దీపిక కనిపించినప్పుడు కూడా ఆమె బేబీ బంప్ కనిపించింది. ఇక ఇప్పుడు ఈ ఊహాగానాలు నిజమని దీపిక ప్రకటించింది. అతి త్వరలో దీపికా, రణ్‌వీర్‌ సింగ్‌ల ఇంట్లో నవ్వులు విరజిమ్మనున్నాయి. ఇక బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో దీపికా, రణ్‌వీర్‌ది స్పెషల్ ప్లేస్. వీరిద్దరి ప్రేమకథ రామ్‌లీలా సినిమా సెట్స్‌లోనే మొదలైంది. వారు 2012 లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత 2018లో ఈ జంట ఇటలీలోని లేక్ కోమోలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. సినిమాల గురించి చెప్పాలంటే దీపిక చివరిగా ఫైటర్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ఇక ఆమె పైప్‌లైన్‌లో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కల్కి 2898 AD, సింఘం ఎగైన్ ఉన్నాయి.

Show comments