Deepika Padukone : బ్రేకింగ్: తల్లికాబోతున్నా.. గుడ్ న్యూస్ చెప్పిన దీపిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepika Padukone announces pregnancy: బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా పలువురు హీరోలు హీరోయిన్లు పెళ్లి బాట పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అలా పెళ్లి బాట పట్టిన హీరోలు హీరోయిన్లు ఒక్కరొక్కరుగా తల్లిదండ్రులు అవుతున్నారు. ఇప్పుడు తాజాగా దీపికా పదుకొనే తన అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సోషల్ మీడియా వేదికగా దీపికా పదుకొనే ఒక ఫోటో షేర్ చేసింది. అందులో సెప్టెంబర్ 2024 అని పేర్కొంటూ దీపిక అలాగే రణవీర్ అని రాసి ఉంది. ఆ ఫోటో చుట్టూ చిన్న పిల్లలకు సంబంధించిన బట్టలు, చెప్పులు, షూస్ ఉన్నాయి. దీంతో ఆమె తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించినట్లు అయింది. ఇక వీరు తమ మొదటి బిడ్డను సెప్టెంబర్ 2024వ సంవత్సరంలో తమ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. ఇక ఈ ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Disney Hotstar Merger : రిలయన్స్, డిస్నీ హాట్‌స్టార్ డీల్ ఓకే..
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
గత కొన్ని రోజులుగా దీపిక ప్రెగ్నెన్సీ గురించి చర్చలు జరుగుతున్నాయి. BAFTA అవార్డ్స్ 2024లో దీపిక చీర కట్టులో కనిపించినప్పుడు, అభిమానులు ఆమె బేబీ బంప్‌ని గమనించారు. ఆ సమయంలో ఆమె సబ్యసాచి వెండి సేక్విన్ చీరను ధరించింది. ఇందులో ఆమె తన బేబీ బంప్‌ను దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తూ కనిపించింది. బాఫ్టా అవార్డ్స్‌కు హాజరైన తర్వాత ముంబై విమానాశ్రయంలో దీపిక కనిపించినప్పుడు కూడా ఆమె బేబీ బంప్ కనిపించింది. ఇక ఇప్పుడు ఈ ఊహాగానాలు నిజమని దీపిక ప్రకటించింది. అతి త్వరలో దీపికా, రణ్‌వీర్ సింగ్‌ల ఇంట్లో నవ్వులు విరజిమ్మనున్నాయి. ఇక బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో దీపికా, రణ్‌వీర్‌ది స్పెషల్ ప్లేస్. వీరిద్దరి ప్రేమకథ రామ్‌లీలా సినిమా సెట్స్‌లోనే మొదలైంది. వారు 2012 లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత 2018లో ఈ జంట ఇటలీలోని లేక్ కోమోలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. సినిమాల గురించి చెప్పాలంటే దీపిక చివరిగా ఫైటర్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ఇక ఆమె పైప్‌లైన్‌లో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కల్కి 2898 AD, సింఘం ఎగైన్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!