NTV Telugu Site icon

Dear OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Dear

Dear

ఈ మధ్య కొన్ని సినిమాలు ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్ గా ఓటీటీలోకి కొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జీవీ ప్రకాష్ కుమార్‌, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటించిన డియర్ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు వారాల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఈ సినిమా కామెడీ మూవీగా వచ్చింది. అందరిని బాగానే ఆకట్టుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఈనెల 28 న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం..

తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.. ఏప్రిల్ 11న డియర్ మూవీ థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకువచ్చింది. గురక సమస్య ప్రధానంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కామెడీని జోడించి దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ డియర్ యూనిక్ కాన్సెప్ట్ తో సరికొత్తగా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశాడు.. అయితే ఏది చూపించాలో అది కరెక్ట్ గా ప్రజెంట్ చెయ్యడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు.. దాంతో ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు..

అందుకే సినిమా రెండు వారాలకే థియేటర్ల నుంచి ఔట్ అయ్యింది.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. న్యూస్ రీడర్‌. చిన్నపాటి శబ్దాలకే నిద్రలో నుంచి మేల్కొంటుంటాడు. అతని దీపికకు గురకపెట్టే అలవాటు ఉంటుంది. ఒకరి సమస్యను మరికొరు దాచేసి పెళ్లిచేసుకుంటారు. భార్య గురక కారణంగా అర్జున్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి గురక సమస్య తగ్గిందా అనేది కథ.. మొత్తంగా కామెడీగా ఉన్నా కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.. ఇక ఓటీటీలో ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..

Show comments