Stampedes : తమిళనాడులో ఘోర విషాదం జరిగింది. విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 31 మంది ప్రాణాలు విడిచారు. ఇంకా పదుల కొద్దీ చావుతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. దేశ చరిత్రలో ఓ పొలిటికల్ ఈవెంట్ కు వెళ్లి ఇంత మంది చనిపోవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ నడుమ చాలా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఆర్సీబీ పరేడ్ లో తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. అంతకు ముందు పుష్ప-2 ప్రీమియర్స్ కు వెళ్లి రేవతి అనే మహిళ చనిపోయారు. ఆమె కొడుకు ఇంకా బెడ్ మీద నుంచి లేవట్లేదు.
Read Also : Manchu Manoj : అర్జున్ రెడ్డి సినిమా మిస్ చేసుకున్న మంచు మనోజ్..
ఇక సినిమా ఈవెంట్లకు వెళ్లి ఎవరో ఒకరు చనిపోతున్న ఘటనలు లెక్కే లేదు. ఇక్కడ ఓ విషయం మాట్లాడుకోవాలి. తొక్కిసలాట ఎక్కడ జరిగినా సరే.. అక్కడ చనిపోయేది మాత్రం అభిమానులే. సినిమా ఈవెంట్ అయినా.. క్రికెట్ పరేట్ అయినా.. రాజకీయ సభ అయినా సరే.. చనిపోయేది మాత్రం సాధారణ అభిమానులే. హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు అందరూ బాగానే ఉంటారు. చనిపోయేది వాళ్ల కోసం వెళ్లిన సాధారణ ప్రేక్షకులే. ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత మంది వస్తారు.. అసలు అక్కడ అంత పెద్ద సభ ఏర్పాటు చేయొచ్చా లేదా.. పోలీసుల సలహాలు ఏంటి అనేవి పాటించాలి కదా. కానీ ఎవరూ పాటించరు.
తమ బల ప్రదర్శన చూపించుకోవాలి.. దాన్ని మీడియాలో, సోషల్ మీడియాలో హైలెట్ చేసుకోవాలనే తాపత్రయమే తప్ప.. అభిమానులకు ఇబ్బంది అవుతుందనే విషయం కూడా ఆలోచించట్లేదు. ఆర్సీబీ పరేడ్ కు ఎంత మంది వస్తారనే సమాచారం లేకుండానే పరేడ్ నిర్వహించారా.. ఇప్పుడు విజయ్ ఎంత మంది వస్తారనే ఇన్ఫర్మేషన్ లేకుండానే ర్యాలీ చేశారా.. తెలిసి కూడా కావాలనే చేస్తున్నారా. ఇదంతా ఎందుకు చేస్తున్నారు.. ఎవరి కోసం చేస్తున్నారు. అక్కడికేదో దేశానికి సేవ చేస్తున్నంత బిల్డప్ ఇస్తూ ఈవెంట్ లు పెద్ద ఎత్తున నిర్వహించడం అవసరమా. ఆల్రెడీ చాలా తొక్కిసలాటలు జరుగుతున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే ఎలా. అభిమానుల ప్రాణాలంటే మరీ అంత చులకన అయిపోయాయా. కొన్ని సార్లు పోలీసులు వద్దని అలెర్ట్ చేసినా వినట్లేదు. చివరకు పోలీసుల వైఫల్యం అని వాళ్ల మీద నెట్టేయడం కామన్ అయిపోయింది. ఎంత హీరో అయినా.. సెలబ్రిటీ అయినా పెద్ద సభలు పెట్టే ముందు ఆలోచిస్తే బెటర్.
Read Also : K-Ramp : కె-ర్యాంప్ అంటే బూతు కాదు.. అర్థం చెప్పిన డైరెక్టర్
