Site icon NTV Telugu

Dayaa Trailer: చావు ప్రాణం తీస్తుంది.. భయం నిజాన్ని దాస్తుంది

Daya

Daya

Dayaa Trailer: సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బ జంటగా పవన్ సాధినేని దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ దయ. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసి.. బెస్ట్ విషెస్ చెప్పాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను బట్టి క్రైమ్ థ్రిల్లర్ గా కనిపిస్తుంది. ఇందులో జేడీ చెవిటివాడిగా కనిపించగా .. అతని భార్యగా ఈషా రెబ్బ కనిపించింది. ఇక ఇందులో రమ్య నంబీశన్, విష్ణు ప్రియ, కమల్ కామరాజ్ లాంటి వారి కీలక పాత్రల్లో కనిపించారు.

Chiranjeevi: చిరంజీవిపై కేసు.. తొమ్మిదేళ్ల తరువాత కొట్టేసిన హైకోర్టు

ట్రైలర్ విషయానికి వస్తే.. ” అనగనగా ఒక అడవి.. అందులో ఎన్నో ప్రాణులు.. కానీ, కొన్ని గుంటనక్కలు దారుణంగా విరుచుకుపడుతున్నాయి” అనే అమ్మాయి వాయిస్ తో మొదలైంది. మొదటి సీన్ లోనే ఒక అమ్మాయిని కొంతమంది అత్యాచారం చేసి.. దారుణంగా హింసించి.. వీడియో తీసినట్లు చూపించారు. ఇక కవితా నాయుడు అనే జర్నలిస్ట్ రెండు రోజులుగా కనిపించడం లేదనే న్యూస్ తో రాష్ట్రము అంతా ఉలిక్కిపడుతోంది. ఆమెను ఎవరో హత్య చేశారని పోలీసులు.. ఆ శవం కోసం గాలిస్తూ ఉంటారు. ఇంకోపక్క ఫిష్ మార్కెట్ లో వ్యాన్ నడిపే వ్యక్తి దయ. అతనికి గర్భిణీగా ఉన్న భార్య ఉంటుంది. దయ చాలా మంచివాడు. అనుకోకుండా అతని వ్యాన్ లో కవితా నాయుడు శవం కనిపిస్తుంది. దీంతో దయకు ఏం చేయాలో తెలియదు.. దాన్ని పోలీసుల నుంచి దాచి.. వేరే ప్రదేశంలో పాతిపెడతాడు. చివరికి ఆ విషయం పోలీసులకు తెలియడంతో దయ చిక్కులో పడతాడు. అసలు కవితాను చంపింది ఎవరు.. ? దయను కావాలనే ఇరికించారా.. ? ఈ పని చేయకముందు దయ ఎవరు.. ? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. చాలా ఏళ్ళ తరువాత జేడీ ఒక ఇంటెన్సివ్ పాత్రలో కనిపించాడు. పాత్రలను బట్టి చూస్తే .. అందరు తమ తమ పాత్రలకు న్యాయం చేసినట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సిరీస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version