David Warner : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు తెలుగునాట భారీ ఫాలోయింగ్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు కప్ అందించిన కెప్టెన్ గా ఆయనకు పేరుంది. అప్పటి నుంచే తెలుగు యువత ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తర్వాత వార్నర్ తెలుగు సినిమాల పాటలకు ఫ్యామిలీతో కలిసి స్టెప్పులేసి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. వార్నర్ మనోడే అన్న పాజిటివ్ నెస్ ను సంపాదించుకున్నాడు. కెరీర్ లో మొదటిసారి అతను సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా తెలుగు సినిమానే. నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న రాబిన్ హుడ్ లో ఆయన కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ పాత్ర కోసం వార్నర్ ఎన్ని కోట్లు తీసుకున్నాడనేదే హాట్ టాపిక్ గా మారింది.
Read Also : Kajal Agarwal : కాజల్ అగర్వాల్ ఘాటు సొగసులు..
ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ కేవలం 2 నిముషాల 50 సెకన్లు ఉండే రోల్ చేస్తున్నాడంట. ఇంత తక్కువ స్క్రీన్ టైమ్ ఉండే పాత్రకు కూడా భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీని కోసం రూ.2.5 కోట్లు తీసుకున్నాడంట. ఈ పాత్ర కోసం రెండు రోజులు షూటింగ్ చేశాడని సమాచారం. అంటే ఒకరోజుకు రూ.1.25 కోట్లు అన్నమాట. ఇంత ఖరీదైన నటుడు ఇతనే కావచ్చేమో. ఎంతైనా వార్నర్ కు ఉన్న స్టార్ ఇమేజ్ కలిసొస్తుందని ఇంత ఇచ్చారేమో అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వార్నర్ వరుసగా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. వార్నర్ రాకతో రాబిన్ హుడ్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది.