NTV Telugu Site icon

Dasara: కరీంనగర్ గడ్డ మీద వంద కోట్ల సక్సస్ సెలబ్రేషన్స్…

Dasara

Dasara

రీజనల్ సినిమాలతో, ప్రేమ కథా చిత్రాలతో ఇప్పటివరకూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా… నేచురల్ స్టార్ గా కెరీర్ ని బిల్డ్ చేస్తూ వచ్చిన నాని ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒక్క సినిమాతో తన బాక్సాఫీస్ పొటెన్షియాలిటిని ప్రూవ్ చేస్తున్న నాని, దసరా మూవీతో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. ఇప్పటివరకూ మనం చూసిన నాని వేరు దసరా సినిమాలో మనం చూసిన నాని వేరు. రా, రస్టిక్, రగ్గడ్ రోల్ లో నాని పీక్ స్టేజ్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ కమర్షియల్ సినిమాలని చాలానే చూస్తూ ఉంటాం కానీ ఒక ఎమోషనల్ డ్రామాని నమ్మిన నాని ఈరోజు పే ఆఫ్ తీసుకుంటున్నాడు. దసరా సినిమాకి ఓపెనింగ్స్ ఊహించిందే అయినా ఆ తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయ్యి థియేటర్స్ ని ప్యాక్ చేసింది. అందుకే తెలంగాణా నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో దసరా సినిమా మైండ్ బ్లోయింగ్ నంబర్స్ ని కలెక్ట్ చేస్తుంది.

దాదాపు అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన దసరా సినిమా ఇప్పటివరకూ వరల్డ్ వైడ్ గా 92 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ ని దగ్గరలో ఉంది. ఈ డే కంప్లీట్ అయితే దసరా సినిమా పోస్టర్ పై వంద కోట్ల అచ్చు పడుతుంది. వర్కింగ్ డేస్ లో కూడా దసరా ఇంపాక్ట్ తగ్గట్లేదు. శ్రీకాంత్ ఓడెల డైరెక్షన్, నాని-కీర్తిల పెర్ఫార్మెన్స్, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ రిపీట్ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పిస్తుంది. వంద కోట్లు ఇచ్చిన ఆడియన్స్ నిపార్టీ ఇవ్వాలి కదా అందుకే మేకర్స్ సినీ అభిమానులకి దసరా బ్లాక్ బస్టర్ దావత్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ వంద కోట్ల సెలబ్రేషన్స్ ని ఏప్రిల్ 5న కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో చెయ్యనున్నారు. నాని అండ్ టీం, ఫాన్స్ తో కలిసి ఈ దావత్ ని ఏ రేంజులో సెలబ్రేట్ చేసుకుంటారో చూడాలి.

Show comments