Oscar 2024: దసరా, బలగం సహా అధికారిక ఎంట్రీ కోసం పోటీలో ఉన్న సినిమాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dasara and Balagam are in Indias Oscar 2024 Official Entry Probables:’ఆర్ఆర్ఆర్’ సినిమా తెలుగు వారి ఆస్కార్ ఆశలను సజీవం చేసింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ గెలుపుతో భారత దేశం నుండి మంచి సినిమాలని పంపాలని మేకర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. భారత దేశం నుండి అధికారికంగా సినిమాలను ఆస్కార్ కి పంపే ప్రక్రియ మొదలైందని తెలుస్తోంది. నిజానికి గత ఏడాది గుజరాతి సినిమా ‘చెల్లో’ని అధికారికంగా పంపగా దానికి అవార్డు రాలేదు. ఇక డాక్యుమెంటరీ విభాగంలో ‘ఎలిఫెంట్ విస్పర్స్’ అనే సినిమాకి వచ్చింది. అయితే 2024 సంవత్సరానికి గాను అంటే వచ్చే సంవత్సరానికి ఆస్కార్ కి ఏ సినిమా అధికారికంగా పంపాలి అనే విషయంలో ప్రక్రియ మొదలైన క్రమంలో గిరీష్ కాసరవెల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ చెన్నైలో పని మొదలెట్టిందని అంటున్నారు. ఇక ఈ క్రమంలో మొత్తం దేశ వ్యాప్తంగా 22 సినిమాలు వచ్చాయని తెలుస్తోంది.
Suriya: బోయమామతో సినిమా అంటే రక్త చరిత్ర 3 రాయిస్తాడేమో?
Also Read
- Sreeleela: ముంబైలో సెట్స్‌పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
- Shanarthi Movie Launched: తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలా ‘శనార్థి’.. సంపత్ నంది బ్యానర్లో కొత్త కాంబినేషన్!
- Wamiqa Gabbi: ఇంతకాలం ఎక్కడున్నావమ్మా.. ఒక్క సినిమాతో వామిక గబ్బికి ఫుల్ డిమాండ్!
- Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్‌గా అదరగొట్టేశాడు!
ఇక ఈ కేటగిరిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయని అంటున్నారు. అవేమంటే నాని హీరోగా నటించిన ‘దసరా’, అలాగే తెలంగాణ నేపథ్యం ఉన్న ‘బలగం’ అని అంటున్నారు. మరోపక్క హిందీ నుంచి, ‘ది స్టోరీ టెల్లర్’, ‘మ్యూజిక్ స్కూల్’, ‘మిస్ ఛటర్జీ వెర్సస్ నార్వే’, ’12th ఫెయిల్’ సినిమాలు ఉండగా ‘గదర్ 2’, ‘ఘుమర్’, ‘అబ్ తో సబ్ భగవాన్ భరోసే’, ‘రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’లను కూడా లిస్టులో ఉంచారని అంటున్నారు. తమిళం నుండి ‘విడుదలై -1’, మరాఠీ నుండి ‘వాల్వి’, ‘బాప్ లాయక్’ సినిమాలు ఉన్నాయని జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలను వీక్షించిన అనంతరం వీటిల్లో ఒక సినిమాను భారత్ తరపున అధికారికంగా ‘బెస్ట్ ఫారెన్ ఫిలిం’ కేటగిరిలో ఆస్కార్‌కు పంపుతారు. మరి చూడాలి వీటిలో ఫైనల్ గా అధికారిక ఎంట్రీ ఏ సినిమా దక్కించుకుంటుంది అనేది.
తాజావార్తలు
-
TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్‌కు కేంద్రం గుడ్‌బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
-
PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
-
Sreeleela: ముంబైలో సెట్స్‌పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
-
Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!