NTV Telugu Site icon

Darshan: దర్శన్ కి దెబ్బ మీద దెబ్బ!!

Darshan 100 Days

Darshan 100 Days

Darshan bail plea gets rejected in Renukaswamy murder case after 4 months of arrest : తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ అయి నాలుగు నెలలు కావస్తోంది. పోలీసులు చార్జిషీట్‌ సమర్పించిన అనంతరం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఆ కోరిక మాత్రం ఫలించడం లేదు. ఆయన బెయిల్ దరఖాస్తును విచారించిన బెంగళూరులోని 57వ సీసీహెచ్ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో దర్శన్ జైల్లోనే కొనసాగడం అనివార్యమైంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దరఖాస్తు చేసుకునేందుకు దర్శన్ కి అవకాశం ఉంది. రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్ జూన్ 11న అరెస్టయ్యాడు. ఆ తర్వాత బెంగుళూరు సెంట్రల్ జైలులో ఉంచారు. అయితే అక్కడ విలాసవంతమైన వసతి లభించినట్టు బయటకు రావడంతో బళ్లారి జైలుకు తరలించారు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ కొట్టివేత కారణంగా బళ్లారి జైలులోనే ఉండాల్సి వచ్చింది.

Anchor Kavyasri: యాంకర్ పై వైసీపీ నాయకుడి దాడి?

బెయిల్ రాకపోవడంతో దర్శన్ అనారోగ్య కారణాలతో బెంగళూరుకు తరలించే అవకాశం ఉంది. దర్శన్ కుటుంబ సభ్యులు ఇప్పటికే మెడికల్ రిపోర్టును సిద్ధం చేశారు. అనారోగ్యం కారణంగా బెంగుళూరుకు షిఫ్ట్ అయ్యేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దర్శన్ గత కొన్ని రోజులుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. దర్శన్ తరపున కోర్టులో సివి నగేష్ వాదించారు. దర్శన్‌కు వ్యతిరేకంగా సాక్షులు కల్పితమని నగేష్ వాదించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రసన్నకుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రసన్నకుమార్ వాదన న్యాయమూర్తికి సమంజసంగా అనిపించడంతో దర్శన్‌కు బెయిల్‌ నిరాకరించింది. దీంతో దర్శన్ కుటుంబం, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బెయిల్ కోరుతూ దర్శన్ తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించడం ఒక ఆప్షన్ కాగా అనారోగ్యం కారణంగా 57వ సీసీహెచ్ కోర్టులో మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం మరో ఆప్షన్ అని అంటున్నారు. ఇక ఆయన జైలు నుంచి విడుదలవుతారనే ఆశతో వందలాది మంది అభిమానులు తరలివచ్చారు.