NTV Telugu Site icon

Dhanush: ఆమె వలనే నా జీవితం నాశనమైంది.. ధనుష్ సంచలన వ్యాఖ్యలు

Dhanush

Dhanush

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరోధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ ఏడాది సార్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ .. కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత D51 చేస్తున్నాడు. ఇక ధనుష్ సినిమాల విషయం పక్కన పెడితే.. ఆయన ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితమే ధనుష్, తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ కు విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక ముందు నుంచి కూడా ధనుష్ పై ఎన్నో పీకర్లు వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోయిన్లు.. త్రిష, శృతి హాసన్ లతో ధనుష్ కు ఎఫైర్లు కూడా ఉన్నాయని కోలీవుడ్ లో టాక్. సుచీ లీక్స్ లో ధనుష్ గురించే ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. అయితే ధనుష్ కు ఇప్పుడే కాదు 10 th క్లాస్ లోనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదట. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా సార్ ప్రమోషన్స్ చెప్పుకొచ్చాడు. ఇది ఎప్పుడో చెప్పాడు కదా.. అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మరోసారి ట్రెండ్ అవుతున్నాయి.

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఇంట్లో మరోసారి అడ్డంగా బుక్కైన రష్మిక?

” నేను పదో తరగతిలో ఉన్నప్పుడు చాలా బాగా చదివేవాడిని.. క్లాస్ టాపర్ నేనే. ఆ తరువాత ఇంటర్మీడియట్‌లో ఓ అమ్మాయి పరిచయం అయ్యింది. ప్రేమలో పడ్డాను. అప్పటినుంచి నా చదువు అటకెక్కింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాటింగ్ లు చేస్తూనే ఉండేవాడిని. అలా నా చదువు మీద ధ్యాస తగ్గింది. ఇంటర్ లో అత్తెసరు మార్కులతో పాసయ్యాను. అలా ఆ పిల్ల నా జీవితాన్ని నాశనం చేసేసింది.. లేకపోతే నేను ఇంటర్ లో మంచి మార్కులు తెచ్చుకొనేవాడిని” అని చెప్పుకొచ్చాడు. చదువు గొప్పతనం గురించి చెప్తూ ధనుష్ సరదాగా చెప్పిన వ్యాఖ్యలు ఇవి. ప్రస్తుతం ధనుష్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments