NTV Telugu Site icon

Damidi Semanthi: తెర వెనుక పోనీవర్మ… తెర మీద రమ్యకృష్ణ!

Ranga

Ranga

Rangamarthanda:క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. ఉగాది కానుకగా ఈ నెల 22న విడుదల కాబోతున్న ఈ సినిమాలోని చివరి గీతం ‘దమిడి సేమంతి’ గురువారం విడుదలైంది. మాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ఈ గీతాన్ని ‘సిత్తరాల సిరపడు’ ఫేమ్ విజయ్ కుమార్ రచించారు. రాహుల్ నంబియార్ పాడారు. విశేషం ఏమంటే… ఈ పాట చిత్రీకరణలో రెండు సినిమా జంటలు సెట్ లో సందడి చేశాయి. వాళ్ళు ప్రకాశ్ రాజ్ – పోనీవర్మ; కృష్ణవంశీ – రమ్యకృష్ణ.

‘రంగమార్తాండ’ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్ అల్లుడుగా నటించిన రాహుల్ సిప్లిగంజ్ ఇచ్చే పార్టీలో ‘దమిడి సేమంతి’ పాట వస్తుంది. హాయిగా మందు తాగేసి… ప్రకాశ్ రాజ్ తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో డాన్స్ చేసే పాట ఇది. బేసికల్ గా కొరియోగ్రాఫర్ అయిన ప్రకాశ్ రాజ్ భార్య పోనీ వర్మ దీనికి నృత్యరీతులు సమకూర్చారు. ఆఫ్ స్క్రీన్ లో భార్య చెప్పిన స్టెప్స్ ను ప్రాక్టీస్ చేస్తూ, ఆన్ స్క్రీన్ లో ప్రకాశ్ రాజ్ రమ్యకృష్ణతో కలిసి సరదా స్టెప్పులేసేలా ఈ పాటను కృష్ణవంశీ తెరకెక్కించారు. సో… ఇటు కృష్ణవంశీ – రమ్యకృష్ణ జంట, అటు ప్రకాశ్ రాజ్ – పోనీవర్మ జంట కూడా ఈ పార్టీ సాంగ్ చిత్రీకరణలో సందడి చేశారన్నది యూనిట్ సభ్యులు చెబుతున్న మాట. ‘రంగమార్తాండ’లోని ఈ చివరి గీతం కూడా తప్పకుండా వ్యూవర్స్ కు నచ్చుతుందనే ఆశాభావాన్ని దీన్ని విడుదల చేసే సందర్భంలో కృష్ణవంశీ వ్యక్తం చేశారు. ఈ లిరికల్ వీడియోలో ఇందులో సాంగ్ మేకింగ్ విజువల్స్ తో పాటు మిగిలిన పాటలు రాసిన లక్ష్మీ భూపాల, కాసర్ల శ్యామ్ కూడా కనిపించారు.

Show comments