NTV Telugu Site icon

Jayaprada: ఇంటిమేట్ సీన్.. నటుడ్ని చెంప దెబ్బ కొట్టిన జయప్రద.. అతడేమన్నాడంటే..?

Dalip

Dalip

Jayaprada: అలనాటి మేటి నటి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగులోనే కాదు.. హిందీలో కూడా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఇక ఆమె అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఆమె గురించి గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక అందులో ఒకటి.. ఒక బాలీవుడ్ నటుడును జయపరదా చెంపదెబ్బ కొట్టిందని. అతను ఎవరో కాదు బాలీవుడ్‌ నటుడు దాలిప్‌ తాహిల్‌. బాలీవుడ్ లో స్టార్ నటుడుగా కొనసాగుతున్న ఆయన.. జయప్రద తో ఇంటిమేట్ సీన్ చేసే సమయంలో ఆమె చెంప దెబ్బ కొట్టిందని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆ వార్తలపై బాలీవుడ్‌ నటుడు దాలిప్‌ తాహిల్‌ స్పందించాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జయప్రద తనను చెంపదెబ్బ కొట్టిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు.

Venkatesh: వెంకీ మామ కూతురి నిశ్చితార్థం.. చిరు, మహేష్ లదే సందడంతా

“జయప్రద అంటే నాకెంతో గౌరవం. ఆమె ఒక అందమైన నటి. ఓ సినిమా సెట్‌లో ఆమె నాపై ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ వచ్చిన వార్తలు చూసి నేను ఆశ్చర్యపోయా. ఇంతకీ ఆ సంఘటన ఏ సినిమా సెట్‌లో చోటుచేసుకుందో చెబితే నేను కూడా తెలుసుకుంటా. ఎందుకంటే నేను ఇప్పటి వరకూ ఆమెతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నదే లేదు. కెరీర్‌ ఆరంభం నుంచి నేను ప్రతినాయకుడి పాత్రల్లోనే ఎక్కువగా నటించా. అందువల్ల అత్యాచారం సన్నివేశాలు నాతో చిత్రీకరించేవారు. అలాంటి సీన్‌ ఏదైనా ఉంటే.. నాతోపాటు హీరోయిన్‌కి కూడా ముందే చెప్పమనేవాడిని. వాళ్లు ఓకే అంటేనే ఆ సీన్‌లో నటిస్తానని.. లేకపోతే చేయనని చెప్పేసేవాడిని. ఒకవేళ దర్శకుడు బలవంతం చేస్తే సెట్‌ నుంచి వెళ్లిపోతానని బెదిరించేవాడిని.. నేనెప్పుడూ ఆమెతో నటించలేదు ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments