Daisy Shah : ఈ మధ్య చాలా మంది నటీమణులు షాకింగ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఏకంగా మగవారిపై ఆమె చేసిన స్టేట్ మెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ డైసీ షా. ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో చేసిన సినిమాతో మంచి పాపులర్ అయింది. ఆమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఇద్దరు అబ్బాయిలతో లవ్ లో పడ్డాను. వాళ్లిద్దరూ నాపై నమ్మకంగా లేరు.
Read Also : Ananya Pande : హెడ్ లైట్స్ బాలేవంటూ ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఎమోషనల్..
నేను వేరే అబ్బాయితో కామన్ గా డ్యాన్స్ చేస్తే రెండో లవర్ వద్దన్నాడు. కానీ అతను మాత్రం వేరే అమ్మాయిలతో తిరిగేవాడు. ఏమైనా అంటే అర్థం చేసుకో అంటాడు. కానీ నాకు నచ్చేది కాదు. అందుకే వదిలేశా. ఆడవాళ్లకు మగ వారి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నా వరకు నాకు ఇలాగే అనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. అందుకే ఎవరిమీద ఆధారపడాలని అనుకోవట్లేదు. జీవితంలో పెళ్లి చేసుకోవాలని నేను నిర్ణయం తీసుకోలేదు అంటూ తెలిపింది డైసీ షా.
Read Also : Saipallavi : శ్రీలీల, కృతిశెట్టి, భాగ్య శ్రీ.. సాయిపల్లవిని చూసి నేర్చుకోండి..
