Site icon NTV Telugu

వైరల్ పిక్ : ముంబై ఎయిర్ పోర్ట్ లో వెంకీమామ

Venkatesh

సీనియర్ హీరో వెంకీ మామ ముంబై ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కారు. ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో ఈ హీరో హైదరాబాద్ వస్తున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ ముంబై విమానాశ్రయంలో కూల్ అండ్ క్యాజువల్ ట్రావెల్ లుక్‌లో యంగ్ గా కన్పించారు. ఆర్మీ గ్రీన్ జాకెట్, మఫ్లర్ ధరించి కెమెరాలకు పోజులిచ్చాడు.

Read Also : “ఆర్ఆర్ఆర్” కోసం మళ్ళీ డేట్స్ త్యాగం… స్టార్ ప్రొడ్యూసర్ ఏమంటున్నాడంటే ?

వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీ ఎంటర్టైనర్ ‘F3’ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఎఫ్3’ ఒక పాట మినహా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. త్వరలో ఈ పాటను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరోవైపు సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రంతో 25 సంవత్సరాల తర్వాత బి-టౌన్‌లో తిరిగి ఎంట్రీ ఇస్తున్నాడు వెంకీ. ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉంది. కామెడీ కేపర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉన్నాయి. అయితే ఈ మూవీలో సల్మాన్ ఖాన్, దగ్గుబాటి వెంకటేష్‌ కలిసి కన్పించబోతున్నారన్న దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Exit mobile version