రానా దగ్గుబాటికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. అతను చేసే ఇంటర్వ్యూల్లోనే కాదు, తనను చేసే ఇంటర్వ్యూలలోనూ దాన్ని సందర్భానుసారం బయట పెడుతుంటాడు రానా. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా బిజీబిజీగా గడిపేసిన రానాను ‘ఎందుకలా?’ అని అడిగితే, ‘ఖాళీగా ఉంటే మా నాన్న ఊరుకోడు’ అంటూ సెటర్స్ వేసే వాడు.
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ మూవీ విడుదల కావాల్సి ఉంది. తొలుత ఇది ఓటీటీలో విడుదల అవుతుందనే ప్రచారం జరిగినా, థియేట్రికల్ రిలీజ్ కోసం కొంతకాలం వేచి ఉందామని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలిసింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ మీమ్ మేకర్…. ‘లాంగ్వేస్ ఇష్యూ కారణంగా ‘విరాటపర్వం’ సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల కాబోతోంది’ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. అది రానా దృష్టిలో పడటంతో అతను దానికి రిప్లయ్ ఇచ్చాడు. ‘ఈ లాంగ్వేజ్ ఇష్యూ అంటే ఏమిటో నాకు కాస్తంత జ్ఞానోదయం చేయండి… ఏమి టైమ్ పాస్ గాళ్ళు బ్రో మీరూ’ అంటూ పడిపడి నవ్వుతున్న ఎమోజీలను పెట్టాడు రానా. తన సినిమా గురించి చేసిన వ్యాఖ్యలను సరదాగా తీసుకుని, తిరిగి అంతే సరదాగా రిప్లయ్ ఇచ్చినందుకు రానాను నిజంగా అభినందించాల్సిందే!
