టాలీవుడ్ మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్‌గా దగ్గుబాటి రానా గత ఆగస్టులో మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో వీరి వివాహ వేడుకను హైదరాబాద్‌లోని రామనాయుడు స్టూడియోలోనే కుటుంబీకులు జరిపించారు. తెలుగు-మార్వాడీ సాంప్రదాయాల్లో జరిగిన వీరి వివాహ వేడుకకు రాయల్ స్టైల్‌లో నిర్వహించారు. రానా-మిహీకాల పెళ్లి సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఎక్కువగా ఎవ్వరినీ ఆహ్వానించలేదు.
రానాకు ఎంతో సన్నిహితుడైన న్యాచురల్ స్టార్ నాని కూడా రానా పెళ్లికి హజరుకాలేదు. అయితే తాజాగా రానాను పెళ్లిచేసుకున్న బజాజ్ ఆడపడుచు.. మిహీకా ఇంస్టాగ్రామ్‌లో వారి పెళ్లికి సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో రానా-మిహీకాల సన్నివేశాలు అద్భుతంగా రావడంతో దీన్ని చూసిన దగ్గుబాటి అభిమానులు షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైర్‌గా మారింది.
వీడియో: A post shared by miheeka (@miheeka)