Site icon NTV Telugu

Daggubati Abhiram: సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్న రానా తమ్ముడు..?

Rana

Rana

Daggubati Abhiram: ఈ ఏడాది కుర్ర హీరోలు అందరూ.. ఒక ఇంటివారవుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కడ.. యువ హీరో ఆశిష్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక వీరి లిస్ట్ లోకి చేరిపోయాడు దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి అభిరామ్. నిర్మాత దగ్గుబాటి సురేష్ రెండో కొడుకు అభిరామ్. ఈ ఏడాది అహింస సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు కానీ, నటుడుగా కొంతవరకు తన నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. అన్న రానా అంత కాకపోయినా.. హీరోగా నిలబడడానికి అభిరామ్ కు కొంత సమయం పడుతుంది అని చెప్పాలి. ఇక గత కొన్ని రోజుల నుంచి అభిరామ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

CID Actor: సిఐడీ నటుడుకు గుండెపోటు..వెంటిలెటర్ పై చికిత్స..

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రేపు అనగా డిసెంబర్ 4 న అభిరామ్ పెళ్లి శ్రీలంకలో జరగనుందని తెలుస్తోంది. అభిరామ్ చేసుకొనే అమ్మాయి పేరు ప్రత్యూష చపరా. ఆమె ఒక బిజినెస్ మెన్ కూతురు అని సమాచారం. ఇక శ్రీలంకలోని ఫైవ్ స్టార్ రిసార్ట్ అనంతర కలుతారా లో వీరి వివాహం జరగనుందట.. అయితే ఇప్పటివరకు అభిరామ్ పెళ్లి గురించి ఎవరు, ఎక్కడ నోరు విప్పింది లేదు. ఈ పెళ్లి కోసం ఇప్పటికే దగ్గుబాటి కుటుంబం శ్రీలంకకు బయల్దేరిందని తెలుస్తోంది. 5 రోజుల పెళ్లిగా అభిరామ్ పెళ్లి జరగనుంది. రేపటి నుంచి మరో 5 రోజులు అక్కడే పెళ్లి వేడుకలు మొదలుకానున్నాయి. ఇక ఈ పెళ్ళికి దాదాపు 200 మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ కు తిరిగివచ్చాక ఇక్కడ గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారనే తెలుస్తోంది. అయితే ఈ పెళ్లి ఇంత సీక్రెట్ గా చేయడం వెనుక కారణం ఏంటి అంది తెలియాల్సి ఉంది.

Exit mobile version