“అహ… అహ… అహ…” అంటూ వచ్చేశారు అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్! ‘ఆహా’ అనిపించేలా ఫస్ట్ సింగిల్ వాయించేశారు! మరీ ముఖ్యంగా, ‘సమ్రాట్ ఆఫ్ మ్యూజిక్’ అంటూ టైటిల్ కార్డ్ వేయించుకున్న డీఎస్పీ దానికి తగ్గట్టే బీట్ తో బీట్ చేసేశాడు. డ్రమ్స్ మోతతో ‘పుష్ప’ ఫస్ట్ సాంగ్ మార్మోగిపోయింది!
దట్టమైన అడవిలా పెరగిపోయిన గడ్డంతో, కీకారణ్యం లాంటి జుట్టుతో బన్నీ మాస్ లుక్ తో అదరగొట్టేసింది! ‘ఐకాన్ స్టార్’గా తరలి వస్తోన్న మన స్టైలిష్ స్టార్ న్యూ టైటిల్ కి తగ్గట్టుగానే న్యూ లుక్ లో మెస్మరైజ్ చేశాడు. ఒకే ఒక్క స్టెప్పుని లిరికల్ వీడియోలో చూపించినప్పటికీ ఇంటెన్స్ గా కనిపించింది అల్లు అర్జున్ ఎక్స్ ప్రెషన్. ఇక పాటలో చంద్రబోస్ లిరిక్స్ డీప్ ఫిలాసఫీని చెబుతూనే మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సాగాయి…
Read Also : “ఇచ్చట వాహనములు నిలుపరాదు” రిలీజ్ డేట్ ఫిక్స్
‘దాక్కో దాక్కో మేక! పులొచ్చి కొరుకుద్ది పీక!’ అంటూ సాగే లిరిక్స్ ‘పుష్ప’ సినిమా కథని చెప్పకనే చెబుతున్నాయి. ప్రాణమే పెట్టుబడిగా సాగే వేట ఎలా అంచలంచెలుగా కొనసాగుతూ ఉంటుందో పాటలో సుకుమార్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఆకలితో మొదలు పెట్టి కాళి దాకా సాగిపోయాడు గీత రచయిత. ఊరికే ట్యూన్ వింటూ ఊగిపోయే వారికే కాదు… ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ సాహిత్య ప్రియులకి, సంగీత ప్రియులకి కూడా బాగా నచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ హీరోగా రశ్మిక మందణ్ణ ఫీమేల్ లీడ్ గా రూపొందిన ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ వేళ విడుదల కాబోతోంది. తొలిసారి బన్నీ ప్యాన్ ఇండియా మూవీతో జనం ముందుకు రాబోతున్నాడు. ‘ఆర్య’గా స్టైలిష్ స్టార్ ని ఇంట్రడ్యూస్ చేసిన సుకుమార్ ఈసారి ఐకాన్ స్టార్ గా రీ ఇన్వెంట్ చేయనున్నాడు…
