NTV Telugu Site icon

Baby: బేబీ ని వదలనంటున్న నిర్మాత.. అప్పుడే ఇంకొకటి

Anand

Anand

Baby: బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న నిర్మాత SKN. నిర్మాతగా మారిన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ ప్రొడ్యూసర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇక బేబీ సినిమా తరువాత SKN పెద్ద హీరోతో సినిమా చేరాడు అనుకుంటే.. మరోసారి తనకు హిట్ ఇచ్చిన బేబీ టీమ్ నే నమ్ముకున్నాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా 100 కోట్ల గ్రాసింగ్ ప్రొడక్షన్ హౌస్ మాస్ మూవీ మేకర్స్,కలర్ ఫొటోతో నేషనల్ అవార్డ్ గెల్చుకున్న బ్యానర్ అమృతా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బేబి సినిమాను యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రూపొందించి.. మెగాస్టార్ చిరంజీవి నుంచి సాధారణ ప్రేక్షకుల దాకా అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే,మాటలు అందిస్తున్నాడు.

Nandamuri Balakrishna: ఈ సమయంలో ఖచ్చితంగా ఇది అవసరం.. వావ్ బాలయ్య

నూతన దర్శకుడు రవి నంబూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసి షూటింగ్ మొదలుపెట్టినట్లు తెలిపారు. ఈ పోస్టర్ లో బీచ్ ఒడ్డున పడవ మీద వైష్ణవి చైతన్య కూర్చొని ఉండగా.. ఆనంద్ కింద కూర్చొని ఏడుస్తున్న వైష్ణవి చెంపలను తడుముతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. వచ్చే సమ్మర్ లో థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మరి ఈ సినిమాతో SKN ఇంకో హిట్ అందుకుంటాడేమో చూడాలి.