Pawan kalyan: సినిమా టికెట్ల ధరలపై పవన్ కళ్యాణ్ కి కీలక సూచనలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crucial Advice on Cinema Ticket Rates to Pawan kalyan: ‘తెలుగు చిత్ర పరిశ్రమకు ఓటీటీతోపాటు సినిమా టికెట్ ధరల విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయని ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ అన్నారు. సినిమా టికెట్ ధరల విషయంలో ఫ్లెక్సిబుల్ విధానం తీసుకురావాలని, ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో కూడా అమలులో ఉందని అన్నారు. ఈ అంశాన్ని పరిశీలించాల’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి గ్రంధి విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి పవన్ కళ్యాణ్ తో విశ్వనాథ్ భేటీ అయ్యారు. పూర్ణా పిక్చర్స్ శత వసంతాల సావనీర్ ప్రతిని పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా గ్రంధి విశ్వనాథ్ మాట్లాడుతూ “ఓటీటీలు మాత్రమే కాదు. సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం కూడా సమంజసంగా లేదు అనే భావన కూడా పేద ప్రజలను సినిమాకు దూరం చేస్తుంది.
OG : అలాంటోడు మళ్ళీ తిరిగొస్తున్నాడు!
Also Read
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
- Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
సినిమా రంగాన్ని బతికించడానికి ఫ్లెక్సిబుల్ రేట్ల విధానం తీసుకొస్తే బాగుంటుంది. దీనిపై ఆలోచన చేయాలి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. కనిష్ట, గరిష్ట రేట్లు ప్రకటిస్తే సినిమా స్థాయిని బట్టి ఫ్లెక్సిబుల్ రేట్ల విధానంలో ధరలు నిర్ణయించుకుంటారు. చిన్న సినిమాలకు ఈ విధానం వల్ల మంచి కలుగుతుంది. ప్రేక్షకులు కూడా సినిమా హాల్ కు వస్తారు. దీని వల్ల అన్ని స్థాయిల చిత్రాలకు మేలు కలుగుతుంది” అని వివరించారు. ఈ సూచనలు విన్న పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి ఈ వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.
తాజావార్తలు
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!