Site icon NTV Telugu

Aadavallu Meeku Johaarlu : రన్ టైం ఎంత? ఇన్సైడ్ టాక్ ఏంటంటే?

AMJ

శర్వానంద్, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”. ఈ మూవీ మార్చ్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, సుధాకర్ చెరుకూరి ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కించారు. “ఆడవాళ్లు మీకు జోహార్లు” మూవీ సెన్సార్ కార్యక్రమాలను తాజాగా పూర్తి చేసుకుంది. సినిమా రన్ టైం కూడా లాక్ అయ్యింది. సినిమా ఎలా ఉంది ? ఇన్సైడ్ టాక్ ఏంటి అంటే… ?

Read Also : Isha Koppikar : ఆ హీరో ఒంటరిగా కలవమన్నాడు… కుదరదు అన్నందుకే అలా…

సెన్సార్ సభ్యుల నుంచి సినిమాకు సానుకూల స్పందన వచ్చిందని తెలుస్తోంది. వెన్నెల కిషోర్, సత్య వంటి స్టార్ కమెడియన్స్ సమక్షంలో సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త లైట్ హాస్యంతో ఆహ్లాదకరంగా సాగుతుందని ఇన్‌సైడ్ టాక్. శర్వానంద్, రష్మిక మందన్నల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ, పెళ్లి గొడవలు, రెండు కుటుంబాల మధ్య సాగే సరదా సన్నివేశాలు, డిఎస్పీ సంగీతం, మనోహరమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆకర్షణీయమైన విజువల్స్ సినిమాకి అతిపెద్ద ఎస్సెట్‌గా మారనున్నాయి అంటున్నారు. ఇక సినిమా కోసం క్రిస్పీ రన్‌టైమ్ లాక్ చేశారట. ప్రకటనలతో సహా సినిమా మొత్తం నిడివి 2:21 గంటలు అని తెలుస్తోంది. ఇక సినిమాలో ఇప్పటి వరకూ బయటపెట్టని ఓ సర్ప్రైజ్ ఉందట. ఈ ఇన్‌సైడ్ టాక్ చూస్తుంటే శర్వానంద్ “చాలా కాలం తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని చూశామని ప్రేక్షకులు ఫీల్ అవుతారు ” అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన మాటను నిలబెట్టుకునేలా ఉన్నాడు.

Exit mobile version