NTV Telugu Site icon

Vishnu Vishal: క్రైమ్, థ్రిల్లర్ ‘ఆర్యన్’ ఆరంభం!

Aaryan

Aaryan

 

హీరో విష్ణు విశాల్ కథానాయకుడిగా, ప్రవీణ్ కె దర్శకత్వంలో, దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్యన్’. శ్రద్ధా శ్రీనాథ్‌, వాణీ భోజన్‌ కథానాయికలు. విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మిస్తుండగా, శుభ్ర, ఆర్యన్ రమేష్ సమర్పిస్తున్నారు. రేసీ మూమెంట్స్, ట్విస్ట్‌లు, టర్న్‌లతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైయింది. విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా ఇటీవల విడుదల చేశారు. ఇందులో విష్ణు విశాల్ ఖాకీ యూనిఫాంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సీరియస్ లుక్ తో చిన్న గడ్డం, మీసాలతో కనిపించాడు.

సాయి రోనక్, తారక్ పొన్నప్ప, అభిషేక్ జోసెఫ్ జార్జ్, మాలా పార్వతి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘ఆర్యన్’ చిత్రానికి విష్ణు సుభాష్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీనిని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ , హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నారు.