Site icon NTV Telugu

Nithin Chauhan: ప్రముఖ నటుడు ఆత్మహత్య?

Suicide

Suicide

రియాలిటీ షో దాదాగిరి 2 విజేత, ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ గురువారం ముంబైలో మరణించారు. నితిన్ వయసు 35 ఏళ్లు మాత్రమే. నితిన్ చాలా టీవీ షోలలో నటించాడు. నితిన్ హఠాన్మరణం పట్ల ఆయన అభిమానులంతా విషాదంలో మునిగిపోయారు. నితిన్ చౌహాన్ కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారాన్ని నితిన్ మాజీ సహనటుడు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. అతని వయస్సు కేవలం 35 సంవత్సరాలు. నితిన్ యూపీలోని అలీఘర్ జిల్లా వాసి. దాదాగిరి 2 షో కాకుండా, నితిన్ స్ప్లిట్స్‌విల్లా సీజన్ 5ని కూడా గెలుచుకున్నాడు.

Music Directors: సినిమాను ముంచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్

రియాల్టీ షో ‘దాద్‌గిరి 2’లో గెలుపొందడం ద్వారా చాలా గుర్తింపు పొందారు. అంతే కాకుండా తన నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. నితిన్ ‘జిందగీ డాట్ కామ్’, ‘క్రైమ్ పెట్రోల్’, ‘ఫ్రెండ్స్’ వంటి టీవీ షోలలో కూడా పనిచేశాడు అయితే వీటిలో ‘క్రైమ్ పెట్రోల్’ ద్వారా చాలా పాపులారిటీ పొందాడు. నితిన్ మాజీ సహనటుల్లో ఒకరైన విభూతి ఠాకూర్ పోస్ట్ ప్రకారం, నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మీడియా నివేదికల ప్రకారం, నితిన్ మరణ వార్త అందుకున్న అతని తండ్రి ముంబై చేరుకున్నారు. నితిన్ మృతదేహాన్ని తిరిగి అలీఘర్‌కు తీసుకువెళతారు. ప్రస్తుతం దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version