వైరల్ పిక్ : జడేజా ఫ్లవర్ అనుకుంటివా ఫైరూ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’ ఫైర్ ఇంకా తగ్గనేలేదు. ఓటిటిలో విడుదలైనప్పటికీ తగ్గేదే లే అంటూ ‘పుష్ప’రాజ్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. సెలెబ్రిటీలు సైతం ‘పుష్ప’రాజ్ మాయలో పడుతున్నారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించిందో అర్థమవుతోంది. సోషల్ మీడియాలో మునుపెన్నడూ లేని విధంగా ‘పుష్ప’ ట్రెండ్ సెట్ చేస్తోంది. ‘తగ్గేదే లే… పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా?… ఫైరూ…” ఈ రెండు డైలాగులు ఇప్పటికీ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
Read Also : మరో స్టార్ కపుల్ బ్రేకప్… నీచం అంటూ హీరో కౌంటర్
Also Read
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
తాజాగా ‘పుష్ప’ ఫైర్ క్రికెటర్లను కూడా తాకినట్లు అన్పిస్తోంది. భారత క్రికెటర్ రవీంద్ర జడేజా పుష్ప రాజ్‌గా మారిపోయాడు. జడేజా మొత్తం ‘పుష్ప’ లుక్ లోకి మారిపోయిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పిక్ లో బీడీ తాగుతూ కన్పించిన జడేజా “పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా… ఫైరూ” అని ట్వీట్ చేశాడు. ఈ ఫోటో ఆయన పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. అయితే ఒక క్రికెటర్‌గా జడేజా పొగాకు వాడకానికి వ్యతిరేకంగా హెచ్చరిక కూడా జారీ చేశాడు.
ఇంతకుముందు జడేజా ‘తగ్గేదే లే’ అనే యూట్యూబ్ షార్ట్ వీడియోను పోస్ట్ చేశాడు. ఇప్పుడు తాజా చిత్రం ‘పుష్ప’ ఉత్తర భారత ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ వల్ల రెండవ భాగం అంటే ‘పుష్ప: ది రూల్’పై భారీ హైప్ పెరిగింది.
Pushpa ante Flower anukunnava
Fireuuuu🔥P.S- Smoking and consumption of tobacco is injurious to health. I do not endorse any form of smoking and the beedi used in the image is for graphic purposes only. pic.twitter.com/yykAlGLLwb
— Ravindrasinh jadeja (@imjadeja) January 12, 2022
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!