మరో స్టార్ కపుల్ బ్రేకప్… నీచం అంటూ హీరో కౌంటర్

ఇప్పటికే ఇండస్ట్రీలో చై-సామ్, అమీర్ ఖాన్-కిరణ్ రావుల విడాకుల విషయం అందరికీ అందరికీ షాక్ ఇచ్చాయి. తాజాగా మరో స్టార్ కపుల్ మధ్య బ్రేకప్ అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. నాలుగు సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తర్వాత బాలీవుడ్ ప్రేమ పక్షులు అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోయారని నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా మలైకా తన ఇంటి నుండి బయటకు రాలేదని, అర్జున్, రియా కపూర్‌తో కలిసి డిన్నర్ పార్టీలో కూడా చేరలేదని వాటి సారాంశం. ఈ వార్తలపై అర్జున్ కపూర్ స్పందిస్తూ షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఈ మేరకు మలైకాతో ఉన్న ఓ స్టైలిష్ పిక్ తో రిప్లై ఇచ్చారు. అంతేకాదు “నీచమైన పుకార్లకు స్థానం లేదు. సురక్షితంగా ఉండండి. ఆశీర్వాదంతో ఉండండి. ప్రజలకు శుభాకాంక్షలు. అందరినీ ప్రేమిస్తున్నాను” అంటూ రూమర్స్ కు షాకింగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంకేముంది దీంతో వీరిద్దరూ విడిపోతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది.

Read Also : ఇద్దరి మంచికే… సామ్ తో డివోర్స్ పై నాగ చైతన్య ఫస్ట్ రియాక్షన్

నగరంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా మలైకా తన విహారయాత్రలను పరిమితం చేసిందని తెలుస్తోంది. ఇక అర్జున్ కపూర్, అతని సోదరి అన్షులా కపూర్, రియా కపూర్, ఆమె భర్త కరణ్ బూలానీలకు కొన్ని వారాల క్రితం కోవిడ్‌ పాజిటివ్ రావడంతో క్వారంటైన్ లో ఉండడం గమనార్హం. కొన్ని రోజుల తర్వాత వారికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. ఇక అర్జున్, మలైకా కొన్ని సంవత్సరాల క్రితం తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అర్జున్ కపూర్ తన కంటే 15 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరాతో డేటింగ్ ప్రారంభించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. కానీ వీరిద్దరి మధ్య ఏజ్ తో సంబంధం లేకుండా విడదీయరాని అనుబంధం ఏర్పడింది.

Related Articles

Latest Articles