Site icon NTV Telugu

Shankar: ఇండియన్ 2 ఓకే సార్… మా గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి

Shankar

Shankar

రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కమల్ హాసన్ ‘సేనాపతి’ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. అవినీతిపైన పోరాడే ఈ క్యారెక్టర్ ని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేసారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… శంకర్-కమల్ హాసన్ లు ఇండియన్ 2ని గ్రాండ్ గా అనౌన్స్ చేసారు. అయితే కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో, అన్ని కారణాలు ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఆగిపోవడానికి కూడా ఉన్నాయి. ఎన్నో మంతనాలు, రెడ్ జెయింట్ ఇన్వాల్వ్మెంట్ తర్వాత అన్ని సమస్యలు సాల్వ్ అయ్యి గతేడాది సెప్టెంబర్‌లో ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ మళ్లీ స్టార్ట్ అయ్యింది.

అప్పటి నుండి ఇండియన్ 2 షూటింగ్‌ బ్రేక్ లేకుండా జరుగుతూనే ఉంది. దాదాపు చివరి దశకు చేరుకున్న ఇండియన్ 2 సినిమా పనులని శంకర్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. లాస్ ఏంజిల్స్ లో ఇండియన్ 2 విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ ని శంకర్ స్టార్ట్ చేసాడు. ఇండియన్ 2 వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి, అక్కడి వరకూ బాగానే ఉంది కానీ రామ్ చరణ్ తో శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి ఏంటి అనేది ఎవరికీ తెలియదు. గత నెల ముందు వరకూ ప్రతి మంత్ లో 12 రోజుల పాటు గేమ్ ఛేంజర్ షూటింగ్ జరిగింది. ఇప్పుడు అది కూడా జరగట్లేదు, ఈ డిలేకి కారణం ఏంటి అనే విషయంలో అప్డేట్ లేదు. షూటింగ్ డిలే అవుతూ ఉండడంతో గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి నుంచి 2024 సమ్మర్ కి వాయిదా పడింది. మరి ఇలానే షూటింగ్ వాయిదా పడుతూ వస్తే గేమ్ ఛేంజర్ 2024 మిడ్ తర్వాతే రిలీజ్ అవుతుంది.

Exit mobile version