Site icon NTV Telugu

Crazy Kalyanam: “క్రేజీ (కాంబినేషన్) కల్యాణం”.. ఇదేదో కొట్టేలా ఉందే!

Crazy Kalyanam

Crazy Kalyanam

టాలీవుడ్‌లో విభిన్నమైన కథలతో వచ్చే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. ఆ కోవలోనే పూర్తిస్థాయి వినోదభరిత కథాంశంతో వస్తోన్న “క్రేజీ కల్యాణం” చిత్రానికి సంబంధించిన టైటిల్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యారో సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న “క్రేజీ కల్యాణం” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తుండగా బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. ఒక పెళ్లి చుట్టూ తిరిగే ఆసక్తికరమైన మలుపులు, కడుపుబ్బ నవ్వించే వినోదంతో ఈ సినిమాను రూపొందించారు.

Also Read :Anasuya : ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన అనసూయ

ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ వీకే, టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ సహా ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్ ఈ సినిమాపై మంచి క్రేజ్ రావడానికి ప్రధాన కారణమైంది, అయితే విభిన్నమైన మేనరిజమ్స్ ఉన్న ఈ నలుగురు ఒకే కథలో ఎలా సందడి చేస్తారో చూడాలన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో నెలకొంది. తెలంగాణలోని అందమైన గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా షూట్ చేయగా పల్లెటూరి వాతావరణం, అక్కడి ఆచార వ్యవహారాలు, ముఖ్యంగా పెళ్లి వేడుకల సందడిని ఈ సినిమాలో సహజంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి చిత్రాలకు అద్భుతమైన మెలోడీలు అందించిన సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు మ్యూజిక్, గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్ వంటి ప్రముఖ గీత రచయితలు సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు.

Exit mobile version