మొన్న శనివారం నాగార్జున… బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ గా ఉన్న భార్యాభర్తలు మరీనా, రోహిత్ లను అందరి ముందు హగ్ ఇచ్చుకోమని సలహా ఇచ్చాడు. అంతేకాదు… ‘నారాయణ నారాయణ… వాళ్ళు పెళ్ళైన వాళ్ళు’ అంటూ బిగ్ బాస్ షోను విమర్శించిన సీపీఐ నారాయణను ఇన్ డైరెక్ట్ గా ఎద్దేవా చేశారు. దీంతో నారాయణకు ఎక్కడో కాలింది. మరోసారి తన విమర్శస్త్రాలను నాగార్జునపై సంధించారు. తాజాగా ”నాగన్నా… నాగన్నా… ఈ బిగ్ బాస్ షోలో మీరు పెళ్ళైన వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇచ్చారు…. శోభనం గదిని ఏర్పాటు చేశారన్నా! మిగతా వాళ్ళు ఏమైనారు అన్నా!?

వాళ్ళకేమీ పెళ్ళిళ్ళు కాలేదు, బంధువులు కాదు కదా?! నూరు రోజుల పాటు వాళ్ళేం చేస్తారు… అది కూడా చెప్పన్నా!” అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ పై నారాయణ చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా నాగార్జున ఉండి ఉంటే బాగుండేది, కానీ తగదునమ్మా అంటూ ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇవ్వడంతో సీపీఐ నేత నారాయణ డైరెక్ట్ గానే మరోసారి నాగార్జునను సోషల్ మీడియా వేదికగా ఏకిపడేశారు. మరి దీనికి నాగ్ ఏం కౌంటర్ ఇస్తారో చూడాలి.