NTV Telugu Site icon

Manjummel Boys: మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలకు షాక్.. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. అసలు ఏమైందంటే?

Manjummel Boys

Manjummel Boys

Court ordered the freezing of bank accounts belonging to the makers of Manjummel Boys: కలెక్షన్లలో రికార్డులు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా నిర్మాతల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేరళ అరూర్‌కు చెందిన సిరాజ్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎర్నాకులం సబ్‌ కోర్టు ఈ తీర్పునిచ్చింది. తాను సినిమా కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా డివిడెండ్, పెట్టుబడి కూడా ఇవ్వలేదని సిరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సబ్ కోర్టు జడ్జి సునీల్ వర్కి ఈ స్పీమా నిర్మాణ సంస్థ పరవ ఫిల్మ్స్ మరియు దాని భాగస్వామి షాన్ ఆంటోనీ 40 కోట్ల విలువైన బ్యాంక్ ఖాతాను స్తంభింపజేశారు. సిరాజ్ వలియతార హమీద్ దాఖలు చేసిన పిటిషన్‌లో.. సినిమా నిర్మాణానికి 7 కోట్లు ఖర్చు చేశారన్నారు. నిర్మాతలు 40 శాతం లాభాల వాటా వాగ్దానం చేసి డబ్బులు తీసుకున్నారని, ఆపై లాభం లేదా పెట్టుబడి చెల్లించకుండా మోసం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Pooja Hegde : ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన బుట్టబొమ్మ.. ఎన్ని కోట్లంటే?

పిటిషన్ ప్రకారం, ఇది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 220 కోట్లు మరియు OTT ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసింది. సినిమా నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్‌లకు కోర్టు నోటీసులు పంపింది. మలయాళ సినీ చరిత్రలో 200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా మంజుమ్మాళ్ బాయ్స్ నిలిచింది. ఫిబ్రవరి 22న థియేటర్లలోకి వచ్చింది. తమిళ డబ్బింగ్ లేకుండా తమిళనాడులో 50 కోట్లు దాటిన తొలి పర భాషా చిత్రం ఇదే. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ మల్టీ స్టారర్ సినిమాకి మలయాళ పరిశ్రమ నుంచే కాక ఇతర భాషల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. బాబు షాహిర్, సౌబిన్ షాహిర్ – షాన్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రాన్ని పరవ ఫిలిమ్స్ మరియు శ్రీ గోకులం మూవీస్ రిలీజ్ చేశాయి. సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, చంతు సలీంకుమార్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, ఖలీద్ రెహమాన్, అరుణ్ కురియన్, విష్ణు రఘు తదితరులు నటించిన మంజుమ్మల్ బాయ్స్ షూటింగ్ కేరళ – తమిళనాడులో జరిగింది.

Show comments