Site icon NTV Telugu

Sridevi : ‘కోర్టు’ మూవీ హీరోయిన్ జాబిలి బ్యాక్ గ్రౌండ్ ఇదే..

Sridevi

Sridevi

Sridevi : హోలీ పండుగ నాడు రిలీజైన్ కోర్టు మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీశ్ డైరెక్ట్ చేశారు. ప్రియదర్శి, రోషన్, శివాజీ చాలా సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి వాళ్లు ఆల్రెడీ అందరికీ తెలుసు. కానీ ఈ మూవీలో జాబిలి పాత్ర చేసిన అమ్మాయిపైనే అందరి దృష్టి పడింది. అసలు ఎవరీ అమ్మాయి అని గూగుల్ లో, సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు కుర్రాళ్లు.

Read Also : Odisha: బ్రాహ్మణ మహిళను పెళ్లి చేసుకున్న మాజీ ఎంపీ.. తెగ నుంచి బహిష్కరణ..

జాబిలి పాత్ర చేసిన అమ్మాయి పేరు శ్రీదేవి. ఆమె పక్కా తెలుగు అమ్మాయి. శ్రీదేవి పూర్తిపేరు శ్రీదేవి ఆపళ్ల. ఆమె సొంతూరు కాకినాడ. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ బాగా ఫేమస్ అయింది శ్రీదేవి. ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. ఈ సినిమాలో జాబిలి పాత్ర కోసం రామ్ జగదీశ్ వెతుకుతుండగా శ్రీదేవి రీల్ ను చూసి ఆమెను ఆఫీస్ కు రమ్మన్నారు. ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసేశారు. ఇందులో ఆమె నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మొదటి సినిమానే అయినా ఏ మాత్రం తడబడకుండా ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమాతో ఆమెకు మరిన్ని ఛాన్సులు రావడం ఖాయం అంటున్నారు.

Exit mobile version