NTV Telugu Site icon

Prabhas: బర్త్ డే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది… అప్డేట్స్ కూడా స్టార్ట్ చేస్తే సంతోషిస్తాం

Prabhas

Prabhas

ఇండియన్ సినిమా చూసిన ఈ జనరేషన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రాబట్టగల సత్తా ఉన్న ఏకైక స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆదిపురుష్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోని 500 కోట్లు రాబట్టింది, అది ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా. ఎన్ని ఫ్లాప్స్ పడినా ప్రభాస్ కి సరైన మాస్ సినిమా పడితే బాక్సాఫీస్ పునాదులు కదులుతాయి అని నిరూపించడానికి వస్తుంది సలార్ సినిమా. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా తెరకెక్కుతున్న సలార్ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సలార్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న మరో భారీ బడ్జట్ సినిమా కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తుంది. ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకూ చూడని విజువల్ ని కల్కి సినిమా చూపించబోతుంది.

గ్రాండియర్ అనేది కూడా కల్కి ముందు చిన్న మాట అయిపోతుంది. రిలీజ్ కి రెడీ అవుతున్న కల్కి, సలార్ సినిమాలతో పాటు ప్రభాస్… మారుతీ డైరెక్షన్ ని ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ ప్రాజెక్ట్ జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు ప్రభాస్ నుంచి షూటింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా సందీప్ రెడ్డి వంగ, హను రాఘవపూడి సినిమాలు లూప్ లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలు సైమల్టేనియస్ గా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. పేరుకి ఇన్ని భారీ సినిమాలు ప్రభాస్ లిస్టులో ఉన్నాయి కానీ ఒక్క సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా బయటకి రావట్లేదు. అకేషన్స్ పోతే పోనిలే అనుకోవచ్చు అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే ఉంది. సరిగ్గా 24 గంటలు కూడా లేదు, అలాంటిది ప్రభాస్ చేస్తున్న సినిమాల నుంచి ఒక్క అప్డేట్ కూడా బయటకి రాలేదు. అప్డేట్ బర్త్ డే రోజున ఇస్తున్నాం అనే అనౌన్స్మెంట్ కూడా బయటకి రాలేదు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం సడన్ సర్ప్రైజ్ లు ఏమైనా ప్లాన్ చేశారేమో చూడాలి.