Thaman: రేయ్ ఎవర్రా మీరంతా… ఇలా తగులుకున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో తమన్ పేరు ట్రెండ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అంత ఫెమస్ కాలేదు. బ్యాక్ టు బ్యాక్ సూపర్బ్ ఆల్బమ్స్ ఇస్తున్న తమన్, అప్పుడప్పుడు కాపీ ట్యూన్స్ కూడా కొడుతూ ఉంటాడు అనే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. లేటెస్ట్ గా ఇలాంటి కామెంట్స్ ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ గురించి వినిపిస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ ఒక మాస్ స్ట్రైక్ వీడియోని రిలీజ్ చేశారు. 24 గంటల్లో మోస్ట్ వ్యూడ్ గ్లిమ్ప్స్ గా టాప్ ప్లేస్ లో ఉన్న పుష్ప ది రూల్ రికార్డ్స్ ని టార్గెట్ చేసిన ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ ఇప్పటివరకు 20 మిలియన్స్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ తమ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దగ్గరే అసలు సమస్య వచ్చింది.
సన్న కర్ర.. సవ్వా దెబ్బ..!
Also Read
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
బొడ్డురాయి.. బేటా దెబ్బ..!
రవ్వల దెబ్బ.. దవడ అబ్బ.. ఉయ్ !!
సరా సరా శూలం.. సుర్రంటాంది కారం!
ఎడా పెడా చూడం.. ఇది ఎర్రెక్కించే బేరం!
సరా సరా శూలం.. సుర్రంటాంది కారం!
ఇనుప సువ్వ.. కౌకు దెబ్బ.. ఇరగదీసే రవ్వల దెబ్బ.. ఉయ్ !!
అంటూ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కొట్టిన సాంగ్ కాపీ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తమన్ మళ్లీ దొరికిపోయాడు అనే విమర్శలు మొదలయ్యాయి. తమన్ నుంచి సాంగ్ బయటకి రాగానే అది కాపీ అనడానికి ఒక వర్గం రెడీగా ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే గుంటూరు కారం ట్యూన్, విజయ్ సేతుపతి ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో.. అనిరుధ్ ఇచ్చిన ‘డిప్ప డిప్పమ్’ ట్యూన్‌లా ఉందని అంటున్నారు. ఇక మాస్ స్ట్రైక్ స్టార్టింగ్‌లో వచ్చే మాస్ బీట్.. దేవిశ్రీ ప్రసాద్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ‘లవ్ దెబ్బ’ సాంగ్ బీట్‌లా ఉందంటూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలని పక్కపక్కన పెట్టి.. తమన్ మళ్లీ కాపీ కొట్టేశాడు అంటూ ట్రోల్ తెగ చేస్తున్నారు. అయితే తమన్ పై కాపీ క్యాట్ ట్రోల్స్ రావడం కొత్త కాదు. అతని ట్యూన్స్ ని కాపీ అంటూ ఉంటారు, అతని సాంగ్స్ ని చార్ట్ బస్టర్స్ చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడూ జరిగేదే కాబట్టి తమన్ పై వచ్చే కామెంట్స్ ని పక్కన పెట్టి గుంటూరు కారం మాస్ స్ట్రైక్ చూసి ఎంజాయ్ చేయండి.
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!