Baby Movie: హిందీ రీమేక్ కి ముందు షాక్.. బేబీ కథ నాదే కాపీ కొట్టారంటూ డైరెక్టర్ ఫిర్యాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Copy Allegations on Baby Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘బేబీ’ సినిమాలో విరాజ్ ఆనంద్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయి కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టి బాక్సాఫీసును ఒక రేంజ్ లో షేక్ చేసి కంటెంట్ ఉంటే సినిమా చిన్నదైనా ఆదరించడానికి ప్రేక్షకుల మనసు పెద్దది అని కూడా నిరూపించింది. ఈ బేబీ సినిమాను డైరెక్టర్ సాయి రాజేష్ డైరెక్ట్ చేయగా డైరెక్టర్ మారుతితో కలిసి నిర్మాతగా మారిన ఎస్కేఎన్ తెరకెక్కించారు. ఇక ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ కారణంగా బేబీ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నట్లు ఎస్కేఎన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా కాపీ వివాదంలో చిక్కుకున్నది. అంతేకాదు డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్(శ్రీనివాస కుమార్‌నాయుడు గాదె)పై పోలీసులకు ఒకరు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Allu Arjun: పాదాల నుంచి చేతి వేళ్ళ దాకా.. అల్లు అర్జున్ ఒంటి నిండా ఆ గాయాలేంటి?
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
సాయి రాజేష్, ఎస్కేఎన్ కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారని శిరిన్ శ్రీరామ్ అనే షార్ట్ ఫిలిం డైరెక్టర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ‘ప్రేమించొద్దు’ అనే టైటిల్‌తో స్టోరీ చెప్పానని అన్నారు. నిజానికి 2013లో ఒక సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పని చేయాలని సాయి రాజేశ్ తనను కోరినట్లు తెలిపాడు. అప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉందని అయితే 2015లో శ్రీరామ్ కన్నా ప్లీజ్ టైటిల్‌తో ఒక కథ రాసుకుని తరువాత దానికి ప్రేమించొద్దు అనే టైటిల్ మార్చనని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే కథ సాయిరాజేశ్కు చెబితే బాగుందని చెప్పి ఎస్కేఎన్కు కథను వినిపించమన్నారు. ఆ తరువాత నాకు ఏ మాత్రం చెప్పకుండా 2023లో సాయిరాజేశ్ తన కథతో అదే నిర్మాతతో బేబీ సినిమా తిసినట్లు పేర్కొన్నారు. ఇక బేబీ కథ, నేను రాసుకున్న ప్రేమించొద్దు కథ ఒక్కటేనని శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదులో వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తి కావస్తూ ఇప్పుడు హిందీలో రీమేక్ కి రెడీ అవుతున్న తరుణంలో ఫిర్యాదు చేయడం కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. ఇక ఈ కాపీ ఆరోపణల నేపథ్యంలో హిందీ రీమేక్ వ్యవహారం ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..